»   » ఒకే దెబ్బకు రెండు పిట్టలు, రాజమౌళి స్కెచ్చే వేరు

ఒకే దెబ్బకు రెండు పిట్టలు, రాజమౌళి స్కెచ్చే వేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఏం చేసినా విభిన్నంగా ఉంటుంది. ఆయన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మంగా రూపొందుతోన్న 'బాహుబలి 2' చిత్రానికి సంబంధించి రానా దగ్గుబాటి ఫస్ట్‌లుక్‌ను ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. రానా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 'అంతం చేయడానికి బలశాలి భల్లాలదేవ బయటకు వచ్చాడు' అని రాజమౌళి ట్వీట్‌ చేస్తూ.. ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ పోటోతో అటు రానా కు ఆనందం ఇటు సినిమాకు పబ్లిసిటీ..ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కదూ...బాహుబలి 2లో రానాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దిసేపటి క్రితం విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 'బాహుబలి 2'లో రానా విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయనతోపాటు ప్రభాస్‌, అనుష్క, తమన్నా చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన 'బాహుబలి'కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Baahubali makers unveiled the first look poster of the actor from Baahubali: The Conclusion and the actor looks fearless. Beefed up with muscles, Rana looks like a giant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu