రానా లవర్ మిహికా ఫ్యామిలీ నేపథ్యం మామూలుగా లేదుగా.. హీరో వెంకటేష్ కూతురు వల్లనే..
టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించగానే సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. తాను తన ప్రేయసి మిహికా బజాజ్ ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమెలో రానా ఆకట్టుకొనే అంశాలు ఏమిటనే అంశాలపై చర్చ జరిగింది. మిహికా బజాజ్ తల్లిదండ్రులు ఎవరు? వారు ఏ రంగంలో ఉన్నారు? రానా అఫైర్‌లో కీలకంగా వ్యవహరించారనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఆ వివరాలు ఏమిటంటే..

మిహికా తల్లి బంటి బజాజ్
మిహికా బజాజ్ పూర్తిగా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. ఆమె తల్లి బంటీ బజాజ్, తండ్రి సురేష్ బజాజ్‌కు క్షాలా అనే జ్యూవెలరీ మేకింగ్ కంపెనీ ఉంది. తల్లి బంటీ బజాజ్ హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. హైదరాబాద్‌లో జ్యువెలరీ డిజైనర్‌గా మంచి పేరు ఉంది. ఆస్తులు, అంతస్తులు భారీగానే ఉన్నాయనేది తాజా టాక్. చిన్నప్పటి నుంచే మిహికా సంపన్న కుటుంబంలో పెరిగింది.

తల్లి ఈవెంట్ కంపెనీని వారసత్వంగా
గతంలో మిహికా బజాజ్ తల్లి బంటీ బజాజ్‌కు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉండేది. ఆమె దేశవ్యాప్తంగా ఈవెంట్లను నిర్వహించడం, అలాగే వెడ్డింగ్ ప్లానర్‌గా కూడా మంచి బిజినెస్‌ను నిర్వహించారు. ఇండియాలోనే టాప్ వెడ్డింగ్ డెకర్ ప్లానర్స్‌గా ఓ ఇమేజ్ కూడా ఉంది. తల్లి నిర్వహించే ఈవెంట్ మేనేజ్‌మెంట్ బిజినెస్‌ను వారసత్వంగా మిహికా కొనసాగిస్తున్నారు.

మిహికా స్టడీస్ ఇలా..
ఇక మిహికా విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో సెకండరీ విద్యను చదివారు. ఆ తర్వాత ముంబైలోని రచన సన్సద్ అనే కాలేజ్ నుంచి ఇంటీరియర్ డిజైన్ కోర్సులో పట్టాను అందుకొన్నారు. ఆ తర్వాత లండన్‌లో చెల్సియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఎంఏ చేశారు. ఆ తర్వాత డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను ప్రారంభించారు.

మిహికా బజాజ్ సోదరుడు గురించి
ఇక మిహికాకు సామర్థ్ అనే సోదరుడు ఉన్నాడు. 2017 నుంచి తమ సొంత ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్షాలాకి సంబంధించిన వ్యవహారాలను చూసుకొంటున్నారు. అలాగే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ సోదరి సాషాని వివాహం చేసుకొన్నారు. ముంబైలో సోదరుడు సామర్థ్ ప్రారంభించిన ఓ కంపెనీ ద్వారా బాలీవుడ్ ప్రముఖులతో భారీగా పరిచయాలు ఏర్పడ్డాయి.
Recommended Video

వెంకటేష్ కూతురుతో క్లోజ్ ఫ్రెండ్ షిప్
ఇక హీరో వెంకటేష్ కూతురు అశ్రితా దగ్గుబాటికి మిహికాకు క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉంది. వారిద్దరి మధ్య విడిదీయలేని స్నేహం కారణంగానే మిహికాకు రానాకు పరిచయం ఏర్పడిందనే తాజా టాక్. రానా, మిహికా బజాజ్ ప్రేమ వ్యవహారం అశ్రితాకు ముందే తెలుసుననేది సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. తన సోదరుడికి అశ్రితా నుంచి మంచి సపోర్ట్ లభించిందనే టాక్.


Click it and Unblock the Notifications











