ఆ విషయంలో ప్రభాస్, అనుష్క ఒక్కటే.. బయటపెట్టిన రానా దగ్గుబాటి
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు ప్రభాస్ - అనుష్క. 40ని ఎప్పుడో క్రాస్ చేసిన వీరిద్దరూ ఇంకా సింగిల్‌గానే ఉండటం అభిమానులను, వారి కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. ప్రభాస్ - అనుష్కలు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని కొంతకాలం వరకు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు వ్యక్తులను పెళ్లాడనున్నారని ప్రచారం జరిగింది. అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి తప్పించి కన్ఫర్మ్ కాలేదు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి.. ప్రభాస్- అనుష్కల ఇష్యూని మరోసారి ప్రస్తావించారు. ఆ సంగతులేంటో చూస్తే :
2009లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిల్లా సినిమాలో తొలిసారిగా ప్రభాస్ - అనుష్క జంటగా నిలిచారు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా పుకార్లు వినిపించాయి. ఇద్దరూ సేమ్ హైట్, మంచి పర్సనాలిటీ కావడంతో ఈ జంట అదిరిపోతుందని అభిమానులు సైతం ఆనందపడ్డారు. నాటి నుంచి నేటి వరకు ఈ 15 ఏళ్ల కాలంలో ప్రభాస్ - అనుష్కల పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వీరిద్దరూ పలు వేదికలపై క్లారిటీ ఇచ్చారు.

ఏం జరిగినా, ఎన్ని వార్తలొచ్చినా.. ప్రభాస్ పెళ్లి అనగానే .. అభిమానులకు, నెటిజన్లకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు అనుష్కనే. ఒకానొక దశలో ప్రభాస్‌కు కొత్త అమ్మాయిని వెతకడం కంటే స్వీటీనే ఇంటికి కోడలుగా తెచ్చుకోవచ్చుగా అంటూ నెటిజన్లు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలలో బిజీగా ఉండగా.. అనుష్క మలయాళంలో ఘాటి, కథనార్ ది వైల్డ్ సొర్సర్ మూవీస్‌లో నటిస్తున్నారు.
ప్రభాస్- అనుష్కల పెళ్లి వార్తలపై ఇటీవల పెద్దగా ఎలాంటి సందడి లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో వారిద్దరి క్లోజ్ ఫ్రెండ్ రానా దగ్గుబాటి పెంట పెట్టారు. రానా, నివేదా థామస్, సృజన్, సిద్ధార్ధ్ రాళ్లపల్లి ఆయన కీలకపాత్రలు పోషిస్తున్న 35 చిన్న కథ కాదు సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రానా దగ్గుబాటిని సుమ ఫన్నీ ఇంటర్వ్యూ చేసింది. స్క్రీన్‌పై కొందరు స్టార్స్ ఫోటోలు డిస్‌ప్లే చేసి వీళ్లు కనుక టీచర్స్ అయితే ఎలాంటి సబ్జెక్ట్స్ చెబితే బాగుంటుందని అడుగుతుంది.
ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు హార్స్ రైడింగ్, ప్రభాస్‌కు బిహేవియర్ అండ్ కల్చర్, అనుష్కకు సేమ్ ప్రభాస్ లాగే బిహేవియర్ అండ్ కల్చర్, రాజమౌళికి ఆల్ సబ్జెక్ట్స్ చెప్పే ట్యూషన్ టీచర్, ఎన్టీఆర్‌కు తెలుగు సబ్జెక్ట్స్ బాధ్యతలు అప్పగిస్తే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని రానా అన్నాడు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. అందరితో హ్యాపీగా ఎలా ఉండాలి అని ప్రభాస్ ఆలోచిస్తుంటారు అని రానా అంటే.. ఆయన హ్యాపీ మినిస్ట్రీ ఇవ్వాలని సుమ అన్నారు. ప్రభాస్ మాదిరిగానే అనుష్క కూడా సేమ్ అని రానా చెప్పారు.
జపాన్‌లో 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు పాఠాలు చెప్పరు. ఇంట్లో ఎలా ఉండాలి. మనుషులతో ఎలా మాట్లాడాలి అనే బేసిక్స్ నేర్పిస్తారు అని రానా అంటే.. మనకు చాలా అవసరం అని సుమ కౌంటర్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్, అనుష్కలకు ఒకటే సబ్జెక్ట్స్ ఇవ్వడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. వారిద్దరి అభిరుచులు, వ్యక్తిత్వం ఒకటే అన్నట్లుగా రానా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రానా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











