రంగంలోకి దిగిన రానా.. ఆలియా భట్‌తో రహస్య చర్చలు.. దేని గురించంటే..?
Recommended Video
అక్కినేని సమంత తాజాగా నటించిన చిత్రం 'ఓ బేబి'. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అంచనాలు లేకుండా వచ్చినా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

బాలీవుడ్‌లోకి రీమేక్
తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేయబోతున్నారంటూ రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని హిందీలోకి తీసుకెళ్లబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు కూడా చేస్తున్నారని టాక్.

రంగంలోకి దిగిన రానా
సురేష్ ప్రొడక్షన్స్ ‘ఓ బేబి' హిందీ రీమేక్ హక్కులను తీసుకుందని తెలుస్తోంది. దీనికి కారణం ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాకు బాలీవుడ్‌లో మంచి పరిచయాలు ఉండడమేననే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ రీమేక్ సంబంధించిన చర్చలు జరిపేందుకు రానా రంగంలోకి దిగాడని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

ఆలియా భట్‌తో రహస్య చర్చలు
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌తో దగ్గుబాటి రానా చర్చలు జరుపుతున్నాడని ప్రచారం జరుగుతోంది. మొదట ఈ పాత్రకు కంగనాను నటింపజేయాలని సురేష్ ప్రొడక్షన్ వాళ్లు అనుకున్నా.. ఆమె పలు చిత్రాలతో బిజీగా ఉండడంతో పాటు తాజాగా ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఆలియాను సంప్రదించారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆలియా నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది అన్న విషయం మాత్రం తెలియరాలేదు.

‘ఓ బేబీ' గురించి..
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని నటించిన చిత్రం ‘ఓ బేబీ'. లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్‌లు తెరకెక్కించారు. ‘మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











