హనీమూన్ ప్లాన్ గట్టిగా వేశాడే... బీచ్‌లో అలా పడుకున్న కొత్తజంట.. రానా-మిహీక పిక్ వైరల్
దగ్గుబాటి వారసుడు రానా ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ మేరకు ప్రేమించి పెళ్లి చేసుకున్నమిహికాతో హనీమూన్‌లో మునిగి తేలుతున్నాడు. లాక్డౌన్‌లో పెళ్లి కావడంతో దగ్గర బంధువుల మధ్యే కానిచ్చేశారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే వివాహా వేడుకలనుఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పెళ్లికి రాలేని వారికి వర్చువల్‌గా వీక్షించే సదుపాయాన్ని కల్పించారు. టాలీవుడ్ హీరోలందరూ రానా పెళ్లిని అలానే వీక్షించారు. అదంతా బాగానే ఉంది. కానీ పెళ్లైన కొత్త జంటకు బయటకు వెళ్లి షికార్లు చేయాలని ఉంటుంది కదా. ఆ సమయం ఈ కొత్తజంటకు ఇప్పుడు వచ్చింది.

పెళ్లి అలా..
రానా తాను ప్రేమించిన ప్రేయసి మిహీకాకు ఆగస్ట్ 8న రాత్రి (8 30) మూడు ముళ్లు వేసి సొంతం చేసుకున్నాడు. రానా మిహీకాలకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్, ఫోటో వచ్చినా ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. రానా మిహీకాల పెళ్లిపై అమూల్ సంస్థ ప్రత్యేకంగా గా బొమ్మ వేసిందంటేనే ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో చెప్పొచ్చు.

రానాపై ప్రేమ..
రానా మిహీకల మధ్య మూడు ముళ్ల బంధం పడ్డాక ప్రేమ ఎక్కువైంది. పెళైన వారానికే మిహీక చేసిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంది. నా ప్రేమ, నా జీవితం, నా ఆత్మ అంతా నువ్వే. నా జీవితంలో పూర్తి భాగమై నా లైఫ్‌కు అర్థం చేకూర్చినందుకు థ్యాంక్స్. నా వ్యక్తిగత జీవితంలో కూడా సంపూర్ణమైన వ్యక్తిగా, మంచి మనిషిగా చేసింది నువ్వే.. ఐ లవ్ యూ అంటూ రానాపై ప్రేమను కురిపించింది.

అలా కుదరలేదు..
పెళ్లి తరువాత ఎంచక్కా విదేశాలుకు చెక్కేసి హనీమూన్‌ను ఎంజాయ్ చేయాలని భావించినట్టున్నాడు రానా. కానీ లాక్డౌన్ వల్ల అది కుదరలేదు. ప్రస్తుతం పరిస్థితులు కొంచెం సద్దుమణిగినట్టుండటంతో ఇద్దరూ కలిసి విదేశాలకు ఎగిరిపోయారు.

అదిరిపోయే పిక్..
సోషల్ మీడియాలో రానా కంటే మిహీకాయే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. రానా మిహీకల పెళ్లి ఫిక్స్ అయ్యాక.. వరుసగా ఫోటోలు షేర్ చేస్తూ నానా హంగామా చేసింది. రానా ప్రేయసి అంటూ మిహీకా ఫాలోవర్ల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. తాజాగా హనీమూన్‌కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసింది మిహాక.
Recommended Video

బీచ్‌లో అలా..
బీచ్‌లో అలా పడుకుని ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ సెల్ఫీ దిగినట్టున్నారు. ఈ సెల్ఫీని రానా తీస్తోండగా.. మిహీక పోజులిచ్చింది. ఆ పోజులు కూడా రానా కోసమే ఇచ్చినట్టుగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ హనీమూన్ పిక్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది. ఇద్దరూ సూపర్ ఉన్నారు.. ఎంజాయ్ చేయండి.. జోడి బాగుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











