Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రానా పెళ్లి వేడుకలో సమంత అల్లరి.. ఆ ఒక్క ఫ్రేమ్ లో సంతోషాల వెల్లువ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరైన దగ్గుబాటి హీరో రానా మొత్తానికి సోలో లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టేశాడు. కెరీర్ కోసం గత కొన్నాళ్లుగా పెళ్లిని దూరం పెట్టిన రానా అసలైతే సమ్మర్ లోనే గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. ఇక మొత్తానికి గత రాత్రి సింపుల్ అండ్ బెస్ట్ గా తన కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేయసి మిహీకా మెడలో రానా మూడు ముళ్ళు వేశాడు.
Recommended Video
ఆ ఫోటోలో సంతోషాల వెల్లువ
రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ పెళ్లిలో కేవలం అతికొద్ది మంది స్టార్ సెలబ్రెటీస్ మాత్రమే పాల్గొన్నారు. ఇక వేడుకకి సంబంధించిన ఒక ఫోటో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలి మొత్తం రానా, మిహికాలతో కలిసి దిగిన ఫోటో నెటిజన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ ఒక్క ఫొటోలో సంతోషాల వెల్లువ విరిసింది. ఇక అందులో నాగ చైతన్య, సమంత కూడా నవ్వుతూ కనిపించారు.
సమంత అల్లరి
సమంతకు రానా వరుసకు బ్రదర్ అవుతాడు అని అందరికి తెలిసిన విషయమే. అందుకే బ్రదర్ పెళ్లి వేడుకలో అక్కినేని వారి కోడలు చేసిన సందడి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందట. సాధారణంగా సమంత తన ఫ్యామిలీ వేడుకలలో చాలా అల్లరిగా ఉంటూ అందరిని ఆటపట్టిస్తుంది. ఇక రానా పెళ్లి వేడుకలో అమ్మడు మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, ఉపాసన కూడా..
ఇక పెళ్లిలో అక్కినేని ఫ్యామిలితో పాటు మరికొందరు సినీ సెలబ్రెటీస్ కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్, ఉపాసన అందరి కంటే ముందుగానే పెళ్లికి వచ్చి రానా మూడు ముళ్ళు వేసే వరకు ఉన్నాడు. వారికి సంబంధించిన ఒక స్పెషల్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎలాంటి రిస్క్ లేకుండా
ఇక అల్లు అర్జున్ సోలోగా స్టైలిష్ గెటప్ లో పెళ్లి వేడుకలో కనిపించాడు. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా రానా దగ్గుబాటి పెళ్లి వేడుక అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఎలాంటి రిస్క్ లేకుండా ముగించారు. రానా పెళ్లి వేడుకను ఇతర సెలబ్రెటీస్ లైవ్ లో కూడా వీక్షించారు. ఇక ప్రతి ఒక్కరు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ అందించారు.