Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భయపెట్టిన దర్శకుడితో రానా భారీ బడ్జెట్ మూవీ.. ఆ రెండు సినిమాల తరువాతే..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో కాస్త డిఫరెంట్ గా సినిమాలు చేసే అతి తక్కువమంది నటులలో రానా దగ్గుబాటి ఒకరు. కథానాయకుడు అనే దాని కన్నా కూడా ఒక మంచి నటుడు అనే దానిలోనే ఎక్కువ ఆనందం ఉందని చెప్పే ఈ బాహుబలి విలన్ నెక్స్ట్ ఎవరు ఊహించని పాత్రలతో దర్శనమివ్వబోతున్నాడు.
పాత్ర ఎలాంటిదైనా సరే ఛాలెంజింగ్ గా తీసుకొని అద్భుతంగా నటించే రానా నెక్స్ట్ హారర్ సినిమాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడితో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో సిద్దార్థ్ తో గృహం అనే సినిమా చేసి పర్ఫెక్ట్ హారర్ హిట్ కొట్టిన మిళింద్ రావ్ మంచి క్రేజ్ అందుకున్నాడు. అతను భయపెట్టిన విధానం బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. ఇక నెక్స్ట్ ఇదే దర్శకుడు రానా దగ్గుబాటితో కూడా ఒక డిఫరెంట్ సినిమా చేయబోతున్నట్లు టాక్.
వీరి కాంబినేషన్ తెరకెక్కబోయే సినిమా యాక్షన్ అడ్వెంచరస్ గా భారీ బడ్జెట్ లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంలో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. ఎందుకంటే మరోవైపు రానా పూర్తి చేయాల్సిన రెండు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి.
విరాటపర్వం కొంత షూటింగ్ మిగిలి ఉండగా మలయాళం హిట్ రీమేక్ అయ్యప్పన్ కోషియమ్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తరువాత రానా తన కొత్త సినిమాను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.