సచిన్, అమీర్, అభిషేక్‌లతో...రాణా దగ్గుబాటి
సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చ్, విద్యా బాలన్ తదితరులతో పాటు తెలుగు హీరో రాణా దగ్బుబాటి కూడా 'ఎర్త్ అవర్' బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం దక్కించుకున్నాడు. మానవ కార్యకలాపాల వల్ల రోజు రోజుకు వేడెక్కి పోతున్న భూగోళాన్ని పరి రక్షించడంలో భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 31న ఒక గంట పాటు అంతా లైట్లు ఆర్పేసి ఎలక్ట్రిసిటీ వాడకం నిలిపి వేయడమే ఎర్త్ అవర్ ప్రధాన ఉద్దేశ్యం. 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' అనే సంస్థ ఈ 2004లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఎర్త్ అవర్ కార్యక్రమానికి ప్రచారం చేసే అవకాశం దక్కించుకుని ప్రకృతిని కాపాడటానికి జరుగుతున్న ఓ మంచి కార్యక్రమంలో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందని రాణా చెప్పుకొచ్చాడు.
రాణా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్ మెంట్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్న రాణా...బ్రెజిల్ హాట్ మోడల్ నతాలియాతో హాట్ హాట్ రొమాన్స్ చేస్తున్నాడు. మరో వైపు రాణా-జెనీలియా నటించిన 'నా ఇష్టం' మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు రాణా క్రిష్ దర్శకత్వంలో కృష్ణం వందే జగద్గుమ్ చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











