»   » బాహుబలిని మించిన పాత్రలో రానా.. దిమ్మతిరిగిపోయే రోల్.. వైరల్‌గా మారిన ట్వీట్

బాహుబలిని మించిన పాత్రలో రానా.. దిమ్మతిరిగిపోయే రోల్.. వైరల్‌గా మారిన ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
దిమ్మతిరిగిపోయే రోల్.. వైరల్‌గా మారిన రానా ట్వీట్

బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి లాంటి విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్న హీరో రానా దగ్గుబాటి మరో సంచలనానికి తెర లేపాడు. తన తదుపరి చిత్రంలో ట్రావంకోర్ మహారాజు మరట్వాడ వర్మ పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకొన్నారు. ట్విట్టర్‌లో తెలిపిన మరుక్షణమే ఈ వార్త మీడియాలో వైరల్‌గా మారింది.

రానా సెన్సేషనల్ ట్వీట్

రానా సెన్సేషనల్ ట్వీట్

సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తన తదుపరి చిత్రం గురించి రానా ట్వీట్ చేశారు. ‘అనిజమ్ థిరునాల్ మరట్వాడ వర్మ.. ది కింగ్ ఆఫ్ ట్రావంకోర్' అనే చిత్రంలో నటిస్తున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్విట్టర్‌లో రానా చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. కేవలం గంటల వ్యవధిలోనే విపరీతంగా రీట్విట్లు చేయడం, లైకులు కొట్టడం జరిగిపోతున్నది.

సెవెన్ ఆర్ట్స్ మోహన్ నిర్మాత

అనిజమ్ థిరునాల్ మరట్వాడ వర్మ.. ది కింగ్ ఆఫ్ ట్రావంకోర్' చిత్రానికి కే మధు దర్శకుడు. రాబిన్ తిరుమల కథను అందిస్తున్నాడు. సెవెన్ ఆర్ట్స్ మోహన్ ఈ చిత్రానికి నిర్మాత అని మరో ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లను అభిమానులు లైకులతో ముంచెత్తారు.

1945 చారిత్రాత్మక చిత్రంలో

ది కింగ్ ఆఫ్ ట్రావంకోర్ చిత్రంపై ఓ పక్క దృష్టిపెడుతూనే మరో చారిత్రాత్మక చిత్రం 1945‌లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సత్య శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం తన రూపురేఖలను మార్చుకోవడం విశేషం.

బోస్ సైన్యంలో సైనికుడిలా

బోస్ సైన్యంలో సైనికుడిలా

1945 చిత్రంలో సుభాష్ చంద్ర బోస్ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ సేనలో ఓ సైనికుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రానా సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో తాను చెట్టినార్ యువతిగా కనిపించనున్నానని ఇటీవల రెజీనా వెల్లడించిన సంగతి తెలిసిందే.

నవంబర్‌లో 1945 ఫస్ట్‌లుక్

నవంబర్‌లో 1945 ఫస్ట్‌లుక్

తెలుగులో 1945 అనే టైటిల్‌తో, తమిళలో తిరంతు అనే పేరుతో విడుదల కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నవంబర్‌లో రానున్నది. ఈ చిత్రంలో సత్యరాజ్, నాజర్, ఆర్‌జే బాలాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కే ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్ఎన్ రాజరాజన్ నిర్మిస్తున్నారు.

English summary
After back-to-back success of his films Ghazi, Baahubali 2 and Nene Raju Nene Mantri.. Rana Daggubati getting ready with another periodic film. Rana Daggubati announced another new project and it turns to be a period outing that will retell the glory of Travancore king Marthanda Varma. On Monday Taking to Twitter, Rana shared the news to his fans: “”Anizham Thirunal Marthanda Varma - the king of Travancore” is the character I tell a story as soon. Pre-production in progress. The film will be directed by K Madhu. Written by Robin Thirumala, Seven arts Mohan is the line producer on the film.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu