twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సేషనల్ బయోపిక్‌లో రానా దగ్గుబాటి.. అచ్చ తెలుగు మల్లయోధుడిగా..

    By Rajababu
    |

    Recommended Video

    Rana To Play Main Role In Historical Bio pic

    బాహుబలి తర్వాత దగ్గుబాటి రానా చిత్రాల ఎంపికలో అనూహ్యమైన మార్పు కనిపిస్తున్నది. ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి, 1945, మరట్వాడా మహారాజు, హాథీ మేరి సాథీ లాంటి విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఒకటి మీడియాలో సంచలనంగా మారింది. ఆ ప్రాజెక్ట్ ఏమింటంటే స్వాతంత్ర్య సమరయోధుడు కోడి రామ్మూర్తినాయుడు జీవిత కథ.

    ఓటమి ఎరుగని యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు

    ఓటమి ఎరుగని యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు

    మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు 5000 కి పైగా పోటీల్లో ఓటమనేదే ఎరుగని యోధుడు. ఆయన ప్రతిభకి మెచ్చి అప్పట్లో కింగ్ జార్జ్ స్వయంగా 'ఇండియన్ హెర్క్యూలెస్', 'కలియుగ భీమ' బిరుదులతో కోడి రామ్మూర్తి నాయుడు గారిని సత్కరించారు. బ్రిటిష్ పాలన బలంగా ఉన్న 1900 తొలి నాళ్ళల్లో , ఈ యువ కలియుగ భీముడు తన సత్తా చాటాడు.

    స్వాత్రంత్య యోధుడిగా

    స్వాత్రంత్య యోధుడిగా

    మహా ధైర్యవంతుడు అయిన ఈయన మల్లయుద్ధం బరిలో అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. బాడీ బిల్డింగ్, మల్లయుద్ధం పట్ల ఉన్న అమితాసక్తి, ఇష్టం కోడి రామ్మూర్తి నాయుడు గారిని ఆ రోజుల్లో మల్లయుద్ధంలో ఓటమనేదే ఎరుగని ధీరుడినిగా నిలబెట్టింది. గోదాలో ఈయన ప్రదర్శించిన పరాక్రమం భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ప్హూర్తి రగిల్చింది.

    కోడి రామ్మూర్తినాయుడు అంటే రానాకు

    కోడి రామ్మూర్తినాయుడు అంటే రానాకు

    కోడి రామ్మూర్తి నాయుడు గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతున్నప్పటి నుండే రానా దగ్గుబాటికి ఆయన మీద విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఈ పాత్ర రానా కెరీర్ లోనే మరిచిపోలేని పాత్ర గా నిలిచిపోతుంది. అలాగే ఈ చిత్రం ఆ మహా మల్లయోధ వీరునికి ఘనమైన నివాళిగా రూపుదిద్దుకోనుంది.

    తెలుగు, హిందీ భాషల్లో

    తెలుగు, హిందీ భాషల్లో

    ప్రస్తుతం ఎన్నో భారీ, వైవిధ్యమైన చిత్రాలతో బిజీగా ఉన్న రానా దగ్గుబాటి త్వరలో చేయబోయే ఈ భారీ, చారిత్రాత్మక యాక్షన్ డ్రామా తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్నది. సౌత్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ తో పాటు ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

    ప్రముఖ దర్శకుడితో సంప్రదింపులు

    ప్రముఖ దర్శకుడితో సంప్రదింపులు

    కోడి రామ్మూర్తినాయుడు జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రం కోసం ఒక అగ్ర దర్శకుడితో సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుంది. చిత్ర కథని రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

    English summary
    With an​ undefeated record of over 5000 bouts, Kodi Rammurthy Naidu was awarded the title of ​'Indian Hercules and 'Kalayuga Bhima' by King George. ​The young Kaliyuga Bhima rose like a phoenix in the early 1900’s, when the British Empirical rule was firmly established in India. He was a brave-heart who fought his battles from a sports ring. Wrestling and bodybuilding were natural passions that spurred him to become the undefeated champion of the wrestling world and fueled India’s independence movement. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X