వామ్మో... రాణాకు ఎంత పెద్ద గాయం!
హీరో రాణా ఇటీవల కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం షూటింగులో వారం క్రితం గాయ పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను రాణా తాజాగా తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. పక్కన ఫోటోలో చూస్తున్నవి ఆ దృశ్యాలే. చూడ్డానికి చాలా భయంకరం ఉన్నాయి కదూ..
ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాంబు పేలుడు ఘటన నుంచి జంప్ చేసే సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాద వశాత్తు రాణా పడిపోయాడు. ప్రస్తుతం తన పరిస్థితి మెరుగైంది. మళ్లీ షూటింగులో పాల్గొంటానని అంటున్నాడు ఈ యువహీరో.
రాణా తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'లో ఓ డిఫెరెంట్ మాస్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. ఈ చిత్రం లో క్యారెక్టర్ గురించి హీరో రాణా ఆ మధ్య మాట్లాడుతూ... నా పేరు బాబు. చదువు బీటెక్. ఈ మాత్రం చదువుకొంటే చాలు... ఓ మంచి ఉద్యోగం సంపాదించేసి, హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అనుకొంటారు. కానీ బాబు అలా కాదు. ఏసీ గదుల్లో కూర్చుంటూ నెలకు వచ్చే నాలుగంకెల జీతంతో సంతృప్తి పడలేదు. అతని లక్ష్యం వేరే ఉంది. అదేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.
దర్శకుడు చెబుతూ ''కృష్ణుడికీ ఈ కథకూ సంబంధం ఏమిటనేది సస్పెన్స్. 'గమ్యం'లోని గాలి శీను, 'వేదం' సినిమాలోని కేబుల్‌రాజు వీరిద్దరికన్నా మా బీటెక్ బాబు మహా మాస్. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని''అన్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











