ఇరుకున పెట్టిన రానా.. సమంత ముందు బుక్కైన నాగ చైతన్య
సమంత నాగ చైతన్య రానా ఇలా అందరూ ఒకే చోట కలిస్తే అక్కడంతా సందడి వాతావరణం నెలకొంటుంది. రానా పెళ్లి సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్‌లో కలిసి నాగ చైతన్య, సమంతలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా సమంత సామ్ జామ్ షోలో నాగ చైతన్యగెస్ట్‌గా వచ్చాడు. అక్కడ సుమంత్, రానాలు నాగ చైతన్యను ఆడుకున్నారు. వీడియో ద్వారా ఓ సందేశం పంపించి ఇరుకున పెట్టే ప్రశ్నలను అడిగారు.

సమంత షోలో..
సమంత ఆహా యాప్ కోసం సామ్ జామ్ అనే షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తానికి మొదటి సీజన్‌ను గ్రాండ్‌గా ముగించేసింది. మొదటి ఎపిసోడ్‌ను విజయ్ దేవరకొండతో గ్రాండ్‌గా ప్రారంభించింది.. అలానే తన భర్తను చివరకు తీసుకొచ్చి మొదటి సీజన్‌ను ఎంతో క్యూట్‌గా ముగించింది.

అందుకే ఇప్పుడు..
సమంత మాట్లాడుతూ.. సామ్ జామ్ మొదటి సీజన్‌కు ఇది చివరి ఎపిసోడ్ అంటూ చెప్పుకొచ్చింది. అందుకే నన్ను పిలిచావా? ఇంట్లోనే ఉంటాడు.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడని పిలిచావా? అని కౌంటర్ వేశాడు నాగ చైతన్య. ఎన్ని సార్లు పిలిచాను వచ్చావా? అంటూ సమంత రివర్స్ అటాక్ చేసింది.

అందులో ఫెయిల్..
అయితే తనకు రేటింగ్ ఇవ్వాల్సిందిగా నాగ చైతన్యకు సమంత ఓ టాస్క్ ఇచ్చింది. పది మార్కులు ఇవ్వాలని చెప్పుకొచ్చింది. అయితే నటనలో పది, హోస్టింగ్‌లో పది, స్టైలింగ్‌లో 9.5 రేటింగ్ ఇచ్చాడు నాగ చైతన్య. అయితే ఇంట్లో పనులు, వంట వంటి విషయాల్లో మాత్రం సమంతకు దారుణంగా రేటింగ్ ఇచ్చాడు. అందులో సమంత ఫెయిల్ అయింది.

ర్యాపిడ్ ఫైర్ అంటూ..
నాగ చైతన్యకు ర్యాపిడ్ ఫైర్ అంటూ సుమంత, రానా, మిగతా ఫ్రెండ్స్‌తో కొన్ని ప్రశ్నలు అడిగించింది. ఇందులో రానా మాత్రం చైతూని ఇరికించేశాడు. వై ఆర్ యూ (Why Are You) అంటూ తన షోకు సంబంధించిన ప్రశ్నే అడిగాడు. ఎందుకు ఉన్నావ్ అంటూ నాగ చైతన్యను రానా అడిగేశాడు.

సమంత కోసమే..
అయితే ఆ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక చైతన్య ఆలోచిస్తుంటే.. ఏం చెబుతాడా? అని సమంత ఆసక్తిగా ఎదురుచూసింది. నా కోసమే కదా? అని సమంత హింట్ ఇవ్వడంతో అవును.. నీ కోసమే..నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసమే.. నిన్ను జీవితాంతం కలిసి ఉండటం కోసమే అంటూ నాగ చైతన్య కవర్ చేసేశాడు.


Click it and Unblock the Notifications











