రాణా కూడా అర్ధనగ్నంగా విప్పడానికి సై అంటున్నాడు
తెలుగు యువ హీరో దగ్గుబాటి రాణా షర్టు విప్పి అర్ధనగ్నంగా కనిపించడానికి సై అంటున్నాడు. ఇందు కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాడు. ఇటీవల మిస్టర్ ఇండియా పోటీల్లో మెడల్ సాధించిన ట్రైనర్ ఆధ్వర్యంలో రాణా సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేస్తున్నారు. 'నా ఇష్టం' సినిమా తర్వాత రాణా క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణ వందే జగద్దురుమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ రాణా షర్టు లేకుండా కండలు తిరిగిన బాడీతో కనిపిస్తాడట.
రాణా, జెనీలియా కాంబినేషన్ లో రూపొందిన నా ఇష్టం చిత్రం మార్చి 23 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మానందం, హర్షవర్థన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, ఆలీ, భరత్, ఉత్తేజ్, చిత్రం శ్రీను, గిరి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, జోగి బ్రదర్స్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, రచనాసహకారం: చంద్రశేఖర్, టి.రమేష్, వేమారెడ్డి, శ్రీకర్, ఫొటోగ్రఫీ: వెంకట్‌ప్రసాద్, సంగీతం: చక్రి, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ తోలేటి.


Click it and Unblock the Notifications











