Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్.. రానా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో మల్టీస్టారర్ సినిమా రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో ఇదివరకే గోపాల గోపాల సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వాళ్ళబ్బాయి రానా దగ్గుబాటితో మరో మల్టీస్టారర్ సినిమాను చేయబోతున్నాడు. ఆ మలయాళం రీమేక్ పై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక రానా రెమ్యునరేషన్ పై కొన్ని రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి.
అంచనయూ అయితే భారిగానే ఉన్నాయి
మళయాళం బాక్సాఫీస్ హిట్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ను తెలుగులో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. మళయాళంలో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రను తెలుగులో పవన్ చేస్తుండగా ఎక్స్ ఆర్మ్ మ్యాన్ గా పృథ్వీరాజ్ చేసిన పాత్రలో రానా నటిస్తున్నాడు.
పవన్, రానా కొట్టుకునే సీన్స్..
ఇక రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా మధ్య సాగే సీక్వెన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అందులో పవన్, రానా కొట్టుకునే సీన్స్ ను ఎలా మ్యానేజ్ చేస్తారనేది మరో హైలెట్ పాయింట్. మళయాళంలో అయితే ఆ రెండు పాత్రల మధ్య మంచి ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి.
నమ్మకం వచ్చిన తరువాతనే..
ఇక రానా, పవన్ కళ్యాణ్ లంటి విభిన్నమైన స్టార్స్ కొట్టుకుంటే వెండితెరపై ఎలా ఉంటుందో ఉహించుకుంటేనే అంతు పట్టడం లేదు. ఇక దర్శకుడు సాగర్ చంద్ర అంతగా అనుభవం లేని దర్శకుడు అయినప్పటికీ ఇద్దరు అగ్ర హీరోలులను మ్యానేజ్ చేయగలడను నమ్మకం వచ్చిన తరువాతనే గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. మరి అతను ఎలా డీల్ చేస్తాడో చూడాలి. సినిమాలో కమర్షియల్ పాయింట్స్ ను హైలెట్ చేస్తూనే ఒరిజినల్ కథ మిస్ కాకుండా స్టోరీ అయితే సెట్ చేసుకున్నట్లు టాక్.
రానా రెమ్యునరేషన్ ఎంత
ఇక సినిమాలో ఎక్కువగా పవన్ చేతిలో దెబ్బలు తినే రానా సినిమాకు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అనే విషయం కూడా వైరల్ గా మారింది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం రానా ఈ సినిమా చేయడానికి రూ.6కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొదట సినిమా చేయడానికి కాస్త ఆలోచించిన రానా ఆ తరువాత దర్శకుడు చెప్పిన కథనానికి మెచ్చుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.