twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను, రాంచరణ్ ఇద్దరం టెన్త్ ఫెయిల్.. ప్రభాస్ బాహుబలిని పక్కన పెట్టి ఉంటే.. రానా!

    |

    Recommended Video

    Rana Daggubati Revealed Some Interesting Facts About Prabhas And Ram Charan | Filmibeat Telugu

    బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో రానా జాతీయ స్థాయిలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, కథాబలం ఉన్న చిత్రాలని రానా ఎంపిక చేసుకుంటున్నాడు. బాహుబలి చిత్రంలో రానా నటించించింది ప్రతినాయకుడి పాత్రే అయినా అతడి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రానా బహు భాషా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    చదువుపై ఆసక్తి లేదు

    చదువుపై ఆసక్తి లేదు

    రానా మాట్లాడుతూ.. తనకు చిన్న తనంలో చదువుపై ఆసక్తి ఉండేది కాదని తెలిపాడు. సినిమాకు సంబంధించిన స్కిల్స్ నేర్చుకునేందుకే ఆసక్తి చూపేవాడిని. మా తాత రామానాయుడుగారు కూడా నా చదువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమాకు సంబంధించిన స్కిల్స్ నాలో ఎలా ఉన్నాయి అనే విషయంపై దృష్టిపెట్టేవారు. నా చిన్నతనంలో మా ఇంట్లో తరచుగా షూటింగ్ జరుగుతుండేది. సెట్స్ మధ్యలో నుంచి స్కూల్‌కి వెళ్ళేవాడిని. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడిందని రానా తెలిపాడు.

    టెన్త్ ఫెయిల్

    టెన్త్ ఫెయిల్

    టెన్త్ క్లాస్‌లో ఫెయిల్ అయ్యా. దీనితో ఇంట్లో వాళ్ళు మరో స్కూల్‌లో జాయిన్ చేశారు. అదే స్కూల్ లో రాంచరణ్ కూడా చదువుతున్నాడు. అలా మేమిద్దరం స్నేహితులం అయ్యాం అని రానా తెలిపాడు. రాంచరణ్ కూడా ఆల్రెడీ టెన్త్ ఫెయిల్ అయి ఆ స్కూల్ లో జాయిన్ అయినట్లు రానా తెలిపాడు. సినిమాల్లోకి రావాలని నాకు ముందే రాసి ఉంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నేను అధికమించి పెద్ద మైలురాయి బాహుబలి చిత్రం అని రానా తెలిపాడు.

    ప్రభాస్ నుంచి నేర్చుకుంది అదే

    ప్రభాస్ నుంచి నేర్చుకుంది అదే

    బాహుబలి ముందు వరకు ప్రభాస్, నేను స్నేహితులం కాదు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌తో నటించిన తర్వాత ఓ మంచి గుణాన్ని అతడి నుంచి నేర్చుకున్నా. సహనంతో మెలిగే గుణాన్ని తాను ప్రభాస్ నుంచే నేర్చుకున్నట్లు రానా తెలిపాడు. ప్రభాస్ ఏ సందర్భంలో కూడా సహనం కోల్పోడు. బాహుబలి చిత్రానికి ప్రభాసే పిల్లర్ అని రానా తెలిపాడు.

    బాహుబలిని పక్కన పెట్టి ఉంటే

    బాహుబలిని పక్కన పెట్టి ఉంటే

    బాహుబలికి ముందే ప్రభాస్ కు మిర్చి రూపంలో సూపర్ హిట్ దక్కింది. ప్రభాస్ కెరీర్ ఆ సమయంలో మంచి జోరు మీద ఉంది. అలాంటి సమయంలో ప్రభాస్ బాహుబలి చిత్రాన్ని ఎంపిక చేసుకు తన ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడు. ఒక్కసారి ఊహించుకోండి.. ప్రభాస్ కు ఉన్న క్రేజ్‌తో ఆ ఐదేళ్లలో ఎన్ని చిత్రాలు చేసి ఉండొచ్చు.. ఎంత డబ్బు సంపాదించి ఉండొచ్చు.. కానీ ప్రభాస్ సినిమాల సంఖ్య, డబ్బు కంటే క్వాలిటికే ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే బాహుబలి చిత్రాన్ని ఎంచుకున్నాడు అని ప్రశంసించాడు.

    English summary
    Rana Daggubati revealed that until Baahubali happened, he was not friends with Prabhas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X