లేదేమో? బాహుబలి 2 గురించి ట్విస్ట్ ఇచ్చిన రానా!
హైదరాబాద్: బాహుబలి 2 గురించి కొంతకాలంగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2లో భల్లాలదేవుడి భార్య పాత్ర ఉంటుందని, ఈ పాత్రకు శ్రీయను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఇటీవల శ్రీయ స్పందిస్తూ తనను ఎవరూ ఆ పాత్ర కోసం సంప్రదించలేదని స్పష్టం చేసారు. తాజాగా రానాకు ఈ విషయమై మీడియా నుండి ప్రశ్న ఎదురవ్వగా...'సీక్వెల్ లో భల్లాలదేవకు భార్య ఉంటుందా?' అంటూ ఎదురు ప్రశ్నించారు.
రానా చెప్పిన విషయాన్ని బట్టి పార్ట్ 2లో భల్లాలదేవుడి పాత్రకు భార్య క్యారెక్టర్ విషయంలో రాజమౌళి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. పార్ట్ 2లో కూడా కథ మొత్తం ప్రధాన పాత్రల చుట్టే తిరుగుతుందని స్పష్టమవుతోంది. భల్లాలదేవకు భార్య పాత్ర విషయమై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బాహుబలి పార్ట్ 1లో రానాకు కొడుకు పాత్రలో అడవిశేష్ కనిపించాడు. కొడుకు ఉన్నాడంటే భార్య కూడా ఉన్నట్లే. 'బాహుబలి-2'లో రానా ప్రేమ అంతా రాజ్య సింహాసనం దక్కించుకోవడంపైనే ఉంటుందని, రానా పాత్ర మరింత క్రూరంగా పార్ట్ 2లో ఉండబోతోందని తెలుస్తోంది.
2016 లోనే పార్ట్ 2 విడుదల కావాల్సిన ఉన్నా షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాక పోవడంతో వాయిదా పడింది. 2017లోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసారు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ఖరారు చేసారు.


Click it and Unblock the Notifications











