మహేష్ రూట్ లోకి రాణా దగ్గుపాటి
టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ బాబు రూటు సెపరేట్. సినిమాలు పరంగానే కాక బ్రాండ్స్ అంబాసిడర్ గా పలు ఉత్పత్తులకు పనిచేయటం మహేష్ కి అలవాటు. ఈ పద్దతిలోనే రాణా దగ్గుపాటి కూడా ప్లాన్ చేద్దామనుకుంటున్నాడు. తాను కొన్ని ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. రాణాకి దమ్ మారో దమ్ సమయంలోనే ఓ మొబైల్ కంపెనీనుంచి అఫర్ వచ్చింది. ఫోటో షూట్ కూడా జరిగింది. చివర నిముషంలో ఎందుకనో వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత కొందరు తమ బ్రాండ్స్ కి పనిచేయమని అడిగినా రాణా తిరస్కరించారు.
తాను చేయబోయే ప్రొడక్టు పెద్దదిగా ఉండాలని, అది తన ఇమేజ్ ని సైతం పెంచగలిగేదిగా ఉండాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం రాణా హిందీలో డిపార్టమెంట్ చిత్రం చేస్తున్నారు. తెలుగులో నేనూ నా రాక్షసి అనంతరం ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో నా ఇష్టం అనే చిత్రం చేస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా చేసే ఆ చిత్రం మలేషియా షెడ్యూలు ఫినిష్ చేసుకుని వచ్చింది. ఇవి కాక ఓ హింది చిత్రం సైతం రాణా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తన మార్కెట్ ని నేషనల్ మార్కెట్ లో పెంచుకోవటంతో రాణా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కొన్ని పెద్ద కంపినీలు తమ బ్రాండ్ అంబాసిడర్ గా రాణాని ఎంచుకోవటానికి ఆసక్తి చూపుతున్నాయి.


Click it and Unblock the Notifications











