ప్రభాస్ హీరోయిన్ తో దగ్గుపాటి రాణా రొమాన్స్
దమ్ మారో దమ్ చిత్రం తో హిందీలో తెరంగ్రేటం చేసిన దగ్గుపాటి రాణా, ఆ తర్వాత డిపార్టమెంట్ చిత్రం చేస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు రాణాకి మరో సినిమా దొరికింది. కంగనా రనౌత్ కాంబినేషన్ లో క్రిష్ అండ్ సూరి టైటిల్ తో మొదలయ్యే చిత్రంకి రాణా సైన్ చేసారు. ఆయేషా చిత్రం దర్సకుడు రాజశ్రీ ఓజా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తను వెడ్స్ మనూ తరహాలో రొమాంటిక్ కామిడీగా సాగుతుందని చెప్తున్నారు. ఇక దగ్గుపాటి రాణా తెలుగులో ప్రకాష్ తోలేటి దర్సకత్వంలో నా ఇష్టం టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మలేషియా లో జరిగింది. ప్రస్తుతం రాణా..రామ్ గోపాల్ వర్మ దర్సకత్వంలో డిపార్టమెంట్ చిత్రం చేస్తున్నారు. ఇక కంగనా రౌనత్ తెలుగులో ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ సరసన చేసింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్ ఏమీ రాలేదు. డిపార్టమెంట్ లో ఆమెను మొదట తీసుకున్నారు కానీ రెమ్యునేషన్ లో తేడాలొచ్చి లక్ష్మీ మంచుని తీసుకున్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











