మంచు లక్ష్మితో రొమాన్స్ చేస్తున్న రాణా
రామానాయుడు మనవడు రాణా దగ్గుబాటి, మోహన్ బాబు కూతురు మంచులక్ష్మి ప్రసన్న రొమాన్స్ చేస్తున్నారు. కొంపతీసి రియల్ లైఫ్ లో అనుకునేరు. అస్సలు కాదండీ బాబూ. ప్రస్తుతం వీరు రీల్ లైఫ్ లో రొమాన్స్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో రూపొందుతున్న 'డిపార్టుమెంట్" సినిమాలో వీరిద్దరూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా అబితాబ్ బచ్చన్ పాల్గొన్న ఓ పెళ్లి వేడుకలో వీరిద్దరు కలిసి ఐటం నెంబర్లో నటిస్తున్నారు.
సినిమాలో రాణా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రేమ పేరుతో రాణా వెంట పడే అమ్మాయి పాత్రలో మంచు లక్ష్మి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త హీరోయిన్ అంజనా సుఖాని షూటింగ్ లో జాయిన్ అయింది. కంగన రనౌత్ ప్లేసులో ఈమెను తీసుకున్నారు. రాణా తన పాత్రను సీరియస్ గా చేస్తున్నాడు. లక్ష్మి మాత్రం సినిమాకు సంబంధించి వివరాలను, తన చేసే పాత్ర గురించి రోజూ సోషల్ నెట్కర్రింగ్ సైట్లలో పోస్టు చేస్తూ తన పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఇంత తాపత్రయ పడుతున్న లక్ష్మికి ఈ సినిమా ఏ మేరకు ఉపయోగ పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











