BLITZ OF DANIEL SHEKAR: నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట? స్టేషన్ లో టాక్ నడుస్తోంది.. రానా పవర్ఫుల్ డైలాగ్
పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ ఆల్ రౌండర్ రాణా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న డేనియల్ శేఖర్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రానా, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పవర్ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రానా డైలాగ్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి.

పవర్ఫుల్ కాంబినేషన్స్
హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న 'భీమ్లా నాయక్' సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవని పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట
'భీమ్లా నాయక్' చిత్రం నుంచి 'రాణా' ఇంట్రడక్షన్ టీజర్ ను ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తుండగా
డేనియల్ శేఖర్ గా మరో పవర్ఫుల్ పాత్రలో రాణా నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. హై వోల్టేజ్ పాత్ర సినిమా స్థాయిని అమాంతంగా పెంచేసింది. "నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది... అని మరో పవర్ఫుల్ డైలాగ్ వదిలాడు.

నేనెవరో తెలుసా..
నేనెవరో తెలుసా ధర్మేంద్ర ... హీరో ..హీరో..!
డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్...!"
అంటూ ఈ డేనియల్ శేఖర్ పాత్రలో రానా చెబుతున్న డైలాగ్స్ అభిమానుల్లో అంచనాల స్థాయిని మరింతగా పెంచేశాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొకసారి తన పెన్ పవర్ ను చూపించినట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
రిలీజ్ ఎప్పుడంటే..
ఈ సినిమాను నిర్మిస్తున్న యువ నిర్మాత సూర్యదేవర నగవంశీ తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని తెలిపారు. ఇక 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మరొక క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం లో నిత్య మీనన్ నాయిక. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Recommended Video

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర


Click it and Unblock the Notifications











