రానా నటించిన ‘ఘాజీ’ మూవీ ట్రైలర్: సూపర్బ్ అనకుండా ఉండలేరు!
తెలుగు హీరో రానా రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఘాజీ'. రానతో పాటు తాప్సీ, కయ్ కయ్ మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితులు ప్రధాన పాత్రలు పోషించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టెన్మె
హైదరాబాద్: తెలుగు హీరో రానా రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఘాజీ'. రానతో పాటు తాప్సీ, కయ్ కయ్ మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితులు ప్రధాన పాత్రలు పోషించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టెన్మెంట్స్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదల చేసారు.
1971లో భారత్ -పాక్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో నీట మునిగిన సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ చిత్రాన్ని తెరకెక్కించాడు. సబ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావడం విశేషం.
ట్రైలర్
ట్రైలర్ చూస్తుంటే సినిమాను హాలీవుడ్ రేంజిలో తెరకెక్కించారని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని విధంగా హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

రానా, తాప్సి
ఈ చిత్రంలో రానా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మగా నటించారు. తాప్సీ మెంగాలీ రెఫుగీ అనన్య పాత్రలో నటించింది.
కెప్టెన్
కయ్ కయ్ మీనన్ కెప్టెన్ రాన్ విజయ్ సింగ్ పాత్రలో నటించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ పాత్రను అతుల్ కులకర్ణి పోషించారు.
ఫిబ్రవరి 17న విడుదల
ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నారు. మాట్నీ ఎంటర్టెయిన్మెంట్, పీవీపీ సినిమాలు కలిసి ఘాజీ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











