»   » మహేష్ బాబు పై రానా ...సెన్సేషన్ కామెంట్స్

మహేష్ బాబు పై రానా ...సెన్సేషన్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అందరూ ఎదురుచూస్తున్న బాహుబలి రిలీజ్ డేట్ దగ్గర పడుతూండటంతో చిత్రం యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అందులో భాగంగా ...చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్న రానా దగ్గుపాటి...కూడా తనకు సాధ్యమైనంతంలో ఫుల్ బిజిగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ బేస్ గా ఆస్క్ రానా అనే ఛాట్ సెషన్ లో పాల్గొన్నాడు.

అప్పుడు మహేష్ అభిమాని ఒకరు..రానాపై ఓ ప్రశ్నను సందించారు. దానికి రానా తనదైన శైలిలో రిప్లై ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ అతను అడిగిన ప్రశ్న ఏంటి...రానా ఏం సమాధానం ఇచ్చారో క్రింద చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rana Daggubati's Sensational Comments On Mahesh Babu

మరో ప్రక్క రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ చేయబోతున్నాడనే వార్త మహేష్ అభిమానులను ఆనందపరుస్తోంది. 'బాహుబలి' రెండు భాగాల తర్వాత రాజమౌళి చేయబోయే కొత్త సినిమాపై స్పష్టత వచ్చింది. 'బాహుబలి 2' ప్రేక్షకుల ముందుకు రాగానే మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్న ఆ చిత్రంపై ఇప్పటికే ఒప్పందం కూడా కుదిరినట్టు ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు రాజమౌళి.

ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని పరిశ్రమలో ఎప్పట్నుంచో చెప్పుకొంటున్నారు. మహేష్‌, రాజమౌళి కలిసి ఇదివరకు చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత మళ్లీ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు. 'బాహుబలి 2'ని కూడా పూర్తి చేసి ఆ వెంటనే మహేష్‌తో సినిమా చేయాలని రాజమౌళి నిర్ణయించుకొన్నారు. మహేష్‌బాబు కూడా 'బ్రహ్మోత్సవం'తో పాటు, త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సివుంది.

ఇక బాహుబలి విషయానికి వస్తే...

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది.

Rana Daggubati's Sensational Comments On Mahesh Babu

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.

అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.

ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.

అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

English summary
The #AskRana session was a super hit since many twitterati participated in the exclusive interactive session. When a Mahesh fan posed a question to Rana Daggubati about his favorite matinee idol, this is what Rana replied.
Please Wait while comments are loading...