ప్రతీసారి తప్పుగానే.. నేను కూడా అలానే రియాక్ట్ అవుతా.. రానా సెటైర్ వైరల్
రానా ప్రస్తుతం అరణ్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రేపు (మార్చి 26) అరణ్య విడుదల అవుతుండగా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాడు రానా. తన సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఫిల్మ్ ఫేర్ సంస్థ ఓ ట్వీట్ వేసింది. అందులో అరణ్యలోని రానా స్టిల్‌ను వాడుకుంది. అయితే అందులో దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి కౌంటర్ వేస్తూ అరణ్య స్టిల్‌ను షేర్ చేసింది. దానిపై రానా సెటైర్ వేశాడు.
అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

ఫిల్మ్ ఫేర్ సంస్థ..
ఫిల్మ్ ఫేర్ సంస్థ గురించి తెలియని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. సినీ విశేషాలు అందిస్తూ నడిపే ఈ సంస్థ అవార్డులను ఎంతో ప్రత్యేకంగా చూస్తుంటారు. అయితే వీరికి మన దక్షిణాది హీరోలు, వారి పేర్లు, వారి కుటుంబ విషయాలు కూడా తెలియవనుకుంటా. ఆ మధ్య మెగా ఫ్యామిలీ రిలేషన్స్ మీదా తప్పుడు ట్వీట్ వేశారు.

తాజాగా అలా..
తాజాగా రానా అరణ్య పోస్టర్‌ను వాడింది ఫిల్మ్ ఫేర్ సంస్థ. ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త రకం కరోనా లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. రెండో దశలోకి ఎంటర్ అయ్యామని కూడా చెబుతున్నారు. అయితే ఇలాంటి మాటలన్నీ వింటే మా రియాక్షన్ ఇలా ఉందంటూ అరణ్య పోస్టర్‌ను షేర్ చేసింది ఫిల్మ్ ఫేర్.

రానా సెటైర్..
అయితే వారు చెప్పిన సంగతి నిజమే అయినా కూడా అందులో రానా పేరును తప్పుగా రాశారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రానా కౌంటర్ వేశాడు. మీరు నా పేరు తప్పుగా రాసిన ప్రతీసారి నేను కూడా అలానే రియాక్ట్ అవుతున్నాను అంటూ పంచ్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Recommended Video

అరణ్య కోసం స్పెషల్..
అరణ్య కోసం రానా స్పెషల్ ప్రమోషన్స్‌ను చేపట్టాడు. ప్రకృతి, అడవి, ఏనుగుల ప్రాముఖ్యతను తెలిపేలా ఓ కిట్‌ను రూపొందించాడు. వాటిని టాలీవుడ్‌లోని సెలెబ్రిటీలందరికీ గిఫ్ట్‌లుగా పంపిస్తున్నాడు. మొత్తానికి అరణ్య సినిమాను తన భుజాల మీద మోస్తున్నాడు రానా.


Click it and Unblock the Notifications











