వెంకీ, రానా పాన్ ఇండియా మల్టీస్టారర్.. రంగంలోకి బాలీవుడ్ దర్శకుడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కొన్ని ప్రాజెక్టులలో ఇద్దరు హీరోలు కూడా నటించే ఛాన్స్ ఉంది. త్వరలో దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కూడా ఒక మల్టీస్టారర్ ప్రాజెక్టులో కలిసి నటించబోతున్నారు. గతంలో రానా బాబాయ్ తో ఒక మంచి సినిమా చేయాలని ఉందని ఓపెన్ గానే చెప్పేశాడు.
కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో వెంకీ, రానాతో కలిసి స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే రానా రైటర్స్ తో ఒక స్టోరీ అయితే సెట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ లా తెరకెక్కించాలని అది కూడా అన్ని భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్టుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు గాని రానా మాత్రం బాలీవుడ్ సైడ్ నుంచే టాలెంటెడ్ దర్శకులను సెర్చ్ చేస్తున్నాడు. మొదట టాలీవుడ్ కి చెందిన దర్శకుల పేర్లు వినిపించినప్పటికి అది నిజం కాదని టాక్ వస్తోంది.

ఇక రూమర్స్ వైరల్ కాకముందే వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పై ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వెంకటేష్ నారప్ప సినిమాతో రానున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ రీమేక్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక రానా దగ్గుబాటి ఆరణ్య సినిమాతో నెక్స్ట్ సోలోగాక్ బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొషియంలో కూడా రానా మరో హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











