twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కొడుక్కి గిఫ్ట్ పంపిన రానా.. నా బాల్యాన్ని అభయ్‌తో పంచుకునే అవకాశం!

    |

    విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు. బాహుబలి లాంటి అద్భుత చిత్రంలో నటించిన రానా త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం హిరణ్యకశిపలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానాపై నవలలు, పురాణం గాధల ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు ఉంది. తాజాగా రానా పంపిన గిఫ్ట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపాడు.

    రానా పంపిన గిఫ్ట్

    రానా పంపిన గిఫ్ట్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ కు రానా పంపిన గిఫ్ట్ బొమ్మలో, ఆహార పదార్థాల్లో కాదు.. విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు. ఒకటి రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో ఉండే అమర్ చిత్ర కథ నవలలని రానా అభయ్ రామ్ కోసం పంపాడు. చిన్న పిల్లలు ఎక్కువగా కథలపై ఆసక్తి చూపుతుంటారు. అందుకే రానా ఈ పుస్తకాలని అభయ్ కి గిఫ్ట్ గా పంపించాడు.

    అమర్ చిత్ర కథ

    అమర్ చిత్ర కథ నవలలు ఇండియాలోని దాదాపు 20 భాషల్లో ప్రచురితమయ్యాయి. ఈ సంస్థ నుంచి వచ్చే పుస్తకాలు బాగా పాపులర్ అయ్యాయి. చరిత్రకు సంబంధించిన కథలు, పురాణ గాధాలని చిన్న పిల్లలకు అర్థమయ్యేలా బొమ్మల రూపంలో ఈ పుస్తకాలు ఉంటాయి. రామాయణం, మహా భారతం లాంటి కథలని ఈ పుస్తకాల్లో బొమ్మల రూపంలో వివరిస్తారు. రానా పంపిన అమర్ చిత్ర కథ పుస్తకాలు చూసి ఎన్టీఆర్ మురిసిపోతున్నాడు.

    నా బాల్యాన్ని అభయ్‌తో

    నా బాల్యాన్ని అభయ్‌తో

    రానా పంపిన పుస్తకాలవలన తన బాల్యాన్ని అభయ్ తో పంచుకునే అవకాశం వచ్చిందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ చిన్న తనంలోనే బాల రామాయణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇక స్వర్గీయ నందమూరి తారకరామారావు అయితే పురాణాలలో దాదాపు అన్ని ప్రముఖ పాత్రలని పోషించారు. పురాణ కథలని అమర్ చిత్ర కథ పుస్తకాల ద్వారా తన కొడుకుకి వివరించే అవకాశం వచ్చిందని ఎన్టీఆర్ సంబరపడుతున్నాడు.

    కొమరం భీం

    కొమరం భీం

    ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. కొమరం భీం, సీతా రామరాజు యుక్తవయసులో ఇంటినుంచి వెళ్లిపోయిన పీరియడ్ ని కల్పిత గాధగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.

    English summary
    Rana Daggubati sens comic books to Jr NTR son
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X