నిర్మాత మోసం చేశాడంటూ రానా సంచలన కామెంట్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన ప్రొడ్యూసర్
విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్న దగ్గుబాటి రానా.. తాజాగా ఓ నిర్మాతపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. సదరు నిర్మాత మోసం చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా రానా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో రానా కామెంట్స్‌పై ఆ నిర్మాత కూడా రియాక్ట్ కావడంతో ఈ విషయం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు చూస్తే..

దీపావళి సందర్భంగా రానా కొత్త సినిమా లుక్
దీపావళి సందర్భంగా రానా కొత్త సినిమా 1945 ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. అప్పుడెప్పుడో 2017 సంవత్సరంలో '1945' పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా సినిమా తీస్తునట్లుగా ప్రకటించాడు రానా. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ సినిమా గురించి అంతా మర్చిపోయారు.

1945 అంటూ సడెన్ సర్‌ప్రైజ్.. రానా రియాక్షన్
ఈ తరుణంలో 1945 ఫస్ట్‌లుక్ అంటూ ఆదివారం కొత్త పోస్టర్ రిలీజ్ చేసి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్ ద్వారా సినిమాను వచ్చే ఏడాది జనవరి 24వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది చూసిన రానా వెంటనే ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు.

ఆ నిర్మాతను నమ్మొద్దంటూ రానా సెన్సేషన్
''1945 సినిమా ఇంకా పూర్తి కాలేదు. నేను దర్శక నిర్మాతలను కలిసి ఏడాది దాటింది. రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన తేడా వల్ల నేను సినిమాను పూర్తి చేయలేక పోయాను. మార్కెట్ నుండి డబ్బును రాబట్టుకోవడానికి నిర్మాత అందరినీ మోసం ఇలా చేస్తున్నాడు. ఆయనను ఎవ్వరూ నమ్మకండి'' అంటూ రానా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కానీ కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు రానా.
ఘాటుగా స్పందించిన నిర్మాత
రానా చేసిన ఈ కామెంట్ చూసి నిర్మాత రాజరాజన్ వెంటనే ఘాటుగా స్పందించాడు. ''సినిమా పూర్తయ్యిందా? లేదా? అని డైరెక్టర్ మాత్రమే నిర్ణయిస్తాడు. 60 రోజుల పాటు షూటింగ్ చేసి కోట్ల రూపాయల ఖర్చు చేశాం. సినిమా పూర్తి కాకుండానే ఎవ్వరూ సినిమా రిలీజ్ చేయరు'' అని ట్వీట్ పెట్టాడు. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

విదేశాల నుంచి వచ్చిన రానా.. ప్రస్తుతం
రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో, సైనికుడి ప్రేమ కథాంశంతో 1945 సినిమా రూపొందుతోంది. ఎస్ ఎన్ రాజరంజన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రానా విషయానికొస్తే.. ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆయన ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు రానా.


Click it and Unblock the Notifications