ఖుష్బూతో వెంకటేష్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన రానా
దగ్గుబాటి రానా సోషల్ మీడియా వేదికగా ఖుష్బూతో వెంకటేష్ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. 1986 సంవత్సరంలో విడుదలైన కలియుగ పాండవులు సినిమాలో పిక్ ఇది. అయితే సడెన్ గా ఇప్పుడు ఆ పిక్ ఎందుకు షేర్ చేశాడనే కదా! మీ సందేహం. ఊరికే ఎందుకు ఇలా రేర్ పిక్ చేస్తాడు లెండి. దానికీ ఓ కారణం ఉంది.
1986 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు (ఆగస్టు 14) కలియుగ పాండవులు సినిమా విడుదలైంది. అంటే విక్టరీ వెంకటేష్ సినీ ప్రస్థానం మొదలుపెట్టి నేటికి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్బంగా దగ్గుబాటి రానా వెంకీకి శుభాకాంక్షలు చెబుతూ ఖుష్బూతో వెంకటేష్ ఉన్న పిక్ అభిమానులతో పంచుకున్నారు. ఈ పిక్ లో కుష్బూ, వెంకటేష్ ఇద్దరూ యంగ్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రేర్ పిక్ కావడంతో రానా షేర్ చేసిన కొద్దిసేపటిలోనే ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

వెంకటేష్ హీరోగా తెలుగు తెరపై ఆరంగేట్రం చేసిన కలియుగ పాండవులు చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు నిర్మించారు. ఇక ప్రెసెంట్ విషయానికొస్తే.. ఇటీవలే ఎఫ్2తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'వెంకీమామ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో వెంకటేష్ అల్లుడు నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











