కబీర్ సింగ్‌కు ఆ రకంగా కలెక్షన్లు రావడం షాకే: రానా.. ట్విట్టర్‌లో సందీప్‌రెడ్డి వంగా ట్రెండింగ్
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ వివాదాలు, భారీ కలెక్షన్ల మధ్య దూసుకెళ్తున్నది. ఇటీవల బాలీవుడ్ మీడియాపై, క్రిటిక్స్‌ను ఉద్దేశించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. అయినా వసూళ్ల వేగం ఏ మాత్రం తగ్గకుండా జెట్ స్పీడ్‌తో బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. అయితే తాజాగా కబీర్ సింగ్ సినిమా కలెక్షన్లపై రానా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. రానా ఏమన్నారంటే..

దక్షిణాది సినిమా అంటే చిన్నచూపు ఉండేది
ఇంతకు ముందు సౌత్ సినిమా అంటే చిన్నచూపు ఉండేది. ఇప్పుడు ఎక్కువగా రీమేక్స్ దక్షిణాది నుంచే బాలీవుడ్‌లో జరుగుతున్నాయి. దాంతో దక్షిణాది సినిమా పరిశ్రమ సత్తా ఏంటో తెలుస్తున్నది. ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ గురించి నాకు ఆసక్తికరమైన రిపోర్ట్ వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందు వేసిన పెయిడ్ ప్రివ్యూలకు దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌లోనే అత్యధికంగా వసూళ్లు నమోదయ్యాయి. అది నాకు షాక్ కలిగించింది అని రానా అన్నారు.

హైదరాబాద్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు
ఏపీ, తెలంగాణ, హైదరాబాద్‌లో కబీర్ సింగ్ కంటే ముందే అర్జున్ రెడ్డిని ఇంతకు ముందే చూశారు. అయినా కబీర్ సింగ్ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడం చాలా షాకింగ్ అనిపిచింది. మంచి కథలకు, టేకింగ్‌కు ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని మరోసారి కబీర్ సింగ్ నిరూపించింది. హైదరాబాద్‌లో కబీర్ సింగ్ వసూళ్లను చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అని రానా పేర్కొన్నారు.

వివాదాస్పదంగా సందీప్ రెడ్డి వ్యాఖ్యలు
మహిళలపై శారీరక హింస, మితీ మీరిన మద్యం, డ్రగ్స్ తీసుకోవడంపై క్రిటిక్స్, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కబీర్ సింగ్‌ను తప్పుగా చూస్తున్నారు. ప్రేమలో ఉంటే ఇద్దరు కొట్టుకోవడం సాధారణం. అది శారీరక హింస ఎలా అవుతుంది? సినిమా గురించి బాలీవుడ్ క్రిటిక్స్‌కు తెలియదని సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్లపై నిరసన వ్యక్తమవుతున్నది. సమంత, చిన్మయి లాంటి వాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్‌లో సందీప్ రెడ్డి వంగా ట్రెండింగ్
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు విపరీతమైన మద్దతు లభిస్తున్నది. ట్విట్టర్‌లో #WeSupportSandeepReddyVanga అనే హ్యాష్ ట్యాగ్ టాప్‌గా ట్రెండ్ అవుతున్నది. వాస్తవికతను ప్రతిబింబించేలా కబీర్ సింగ్‌ను తీసిన సందీప్ రెడ్డికి సపోర్ట్ ఇస్తాం. బోల్డ్ కంటెంట్‌ను కాదు.. ప్రేమలో ఉండే బాధను చూడండి. డైరెక్టర్‌కు జంటిల్మన్ సపోర్ట్ ఇద్దాం అంటూ ఓ ట్వీట్ల వర్షం కురుస్తున్నది. కాగా, కబీర్ సింగ్ రూ.300 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











