నేడు... హీరో రాణా సిస్టర్ మాళవిక వివాహం
హైదరాబాద్: హీరో రాణా సోదరి మాళవిక వివాహానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. నేడు హైదరబాద్ నానక్ రాం గూడలోని రామానాయుడు స్టూడియో రాత్రి 8.50 గంటలకు ఈ వివాహ మహోత్సవనికి వేదిక కానుంది. మాళవిక వివాహం భరత్ అనే వ్యక్తితో నిశ్చయమైన సంగతి తెలిసిందే.
ఈ వేడుకకు బంధు మిత్రులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, కేంద్ర, రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు కలిసి దాదాపు 10వేలకు పైగా అతిథులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మాళవిక తాత రామానాయుడు దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు తీసారు. ఈ నేపథ్యంలో ఆయా సినీ రంగాల నుంచి ప్రముఖులు ఈ వేడుకు హాజరవనున్నారని తెలుస్తోంది.
ఇక వరుడి విషయానికొస్తే... చిత్తూరు వాస్తవ్యులైన భరత్ కుటుంబం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారికి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. మాలివిక మేనేజ్‌మెంట్ కోర్సులో గాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం కార్వీ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేసింది. వెంకటేష్ వైఫ్ నీరజ అంకుల్ ఈ సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











