రాణా సిస్టర్ మాళవిక...వెడ్డింగ్ కార్డ్ ఇదే!
హైదరాబాద్: రాణా సోదరి మాళవిక వివాహం భరత్ అనే వ్యక్తితో డిసెంబర్ 5 జరుగనున్న విషయం తెలిసిందే. తాజాగా పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ బయటకు వచ్చింది. అందులోని వివరాల ప్రకారం డిసెంబర్ 5వ తేదీ రాత్రి 8.50 నిమిషాలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. హైదరబాద్ నానక్ రాం గూడలోని రామానాయుడు స్టూడియో ఈ వివాహ మహోత్సవానికి వేదిక కానుంది. వీరి వెడ్డింగ్ కార్డ్ ఇమేజ్ ను ఇక్కడ వీక్షించండి.
వధువు మాళవిక దేవి..... శ్రీమతి లక్ష్మి-శ్రీ డి. సురేష్ బాబు దంపతుల కూతురు, శ్రీమతి రాజేశ్వరి-డా. రామానాయుడుల మనవరాలు. వరుడు భరత్ కృష్ణ...డా.పద్మావతి-డా. రాజా మోహన్ రావు పొట్లూరి కుమారు. కొన్ని నెలల క్రితమే మాళవిక దేవి-భరత్ కృష్ణ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో జరిగింది.
చిత్తూరు వాస్తవ్యులైన భరత్ కుటుంబం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారికి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. మాలివిక మేనేజ్‌మెంట్ కోర్సులో గాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం కార్వీ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తోంది. వెంకటేష్ వైఫ్ నీరజ అంకుల్ ఈ సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












