యువ హీరో సినిమాలో దగ్గుబాటి రానా స్పెషల్ రోల్..
దగ్గుబాటి రానా ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త ధనం ఉంటుంది. కేవలం హీరోగానే కాకుండా విభిన్నమైన గెస్ట్ పాత్రలతో కూడా మెప్పిస్తున్న ఈ బాహుబలి విలన్ త్వరలో మెగా హీరో సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఇక ఆ మెగా హీరో మరెవరో కాదు. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వైష్ణవ్ తేజ్.
వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మంచి సందేశాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఒక ముఖ్యమైన పాత్రలో రానా నటించనున్నాడట. ముందుగా రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పెట్టాలని అనుకున్నప్పటికి సినిమాకు ఆ పాత్ర చాలా కీలకమని దగ్గుబాటి హీరోను సెట్ చేసుకున్నారట. ఇదివరకే రానా క్రిష్ దర్శకత్వంలో కృష్ణం వందే జగద్గురుమ్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ అంతగా వర్కౌట్ కాలేదు.

ఆ తరువాత వీరిద్దరూ మరో సినిమా చేయబోతున్నట్లు రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ ఎందుకో సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఫైనల్ గా క్రిష్ ఒక స్పెషల్ రోల్ ఉందని చెప్పడంలో వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే వికారాబాద్ ఫారెస్ట్ లో కొంత షూటింగ్ ని పూర్తి చేసిన క్రిష్ వచ్చే షెడ్యూల్ లో రానాతో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తాడని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సాయి పల్లవి నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా రానా ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











