బల్లాల దేవుడి పాత్ర తరువాత.. నా జీవితంలో అనుకోలేదు.. రానా
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర ముఖ్యమంత్రి చంద్రబాబుది. ఈ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. చాలా మంది ప్రేక్షకులు చంద్రబాబు పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఆ పాత్ర పోషించిన రానా మాట్లాడుతూ.. బల్లాల దేవుడు తరువాత చంద్రబాబు నాయుడుగారి పాత్రలో చేస్తానని నా జీవితంలో అనుకోలేదు. క్రిష్ తో నా జర్నీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంతో ప్రారంభం అయింది.
బాలయ్య నటించిన కథానాయకుడు చిత్రం విడుదల రోజు 1984, డిసెంబర్ 14న తాను జన్మించానని రానా తెలిపాడు. తాను మొట్టమొదట చూసిన సినిమా షూటింగ్ కూడా బాలయ్యదే అని రానా తెలిపాడు. ఆయన నటించిన రాము చిత్ర షూటింగ్ మా ఇంట్లోనే జరిగింది. ముందుగా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలపాలి. మా కోసం ఆయన సమయం కేటాయించారు. నేను పోషించిన ఈ పాత్రకు మొదటి ప్రేక్షకుడు ఆయనే. ఆయనకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ చిత్రంలో నటించడం నాకు దక్కిన గొప్ప అవకాశం అని రానా తెలిపాడు.



Click it and Unblock the Notifications











