'వేదం' చూసా అదెలాగ ఉందంటే: రాణా
నేను వేదం చిత్రం చూసాను...అది ఓ ఇన్ క్రెడిబుల్ ఫిల్మ్. దర్శకుడు క్రిష్ చాలా ఫ్యాషనేట్ గా చిత్రాన్ని తెరకెక్కించారు. బన్నీ బెస్ట్ ఫెరఫార్మెన్స్ ఇచ్చారు. ఓ విభిన్నమైన స్టైల్, స్ట్రచ్చర్ తో సినిమా ఉంది. తెలుగు సినిమా పోగ్రస్ ఇలాంటి స్టోరీస్, స్టోరీ లైన్స్ వస్తుంది. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్కలు ఇలాంటి విభిన్న తరహా సినిమాలు చేయటానికి సపోర్ట్ చేయటం, నేను చాలా గర్వంగా, హ్యాపీగా ఫీలవుతున్నాను. ఈ చిత్ర నిర్మాతలు శోభు, చిన్నలు నా స్నేహితులు వారికి ఇలాంటి సినిమా చేయటానికి ముందుకొచ్చినందుకు అభినందనలు తెలియచేస్తున్నాను అంటూ మెచ్చుకున్నారు రాణా దగ్గుపాటి...రీసెంట్ గా ట్విట్టర్ లో.
గమ్యం ఫేమ్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం రేపు అంతటా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కేబుల్ రాజు గా మాస్ క్యారక్టర్ లో కనపడితే, మంచు మనోజ్...రాక్ స్టార్ గా ఆనందపరుస్తారు. ఇక అనుష్క...సరోజ అనే వేశ్య పాత్రలో కనిపించి అలరించనుంది. ఇక క్రిష్ ఈ చిత్రంకు ముందు రాణా సొంత సంస్ధ సురేష్ ప్రొడక్షన్ లో దాదాపు సంవత్సరం పాటు వెంకటేష్ కోసం కృష్ణం వందే జగద్గురం అనే స్క్రిప్ట్ చేసారు. కానీ మెటీరియలైజ్ చెయ్యలేదు. ఆ తర్వాతే బయిటకు వచ్చి క్రిష్ ఈ వేదం చిత్రం ప్రారంభించారు. ఇక ఈ చిత్రం హిట్టయితే రాణా ఏమన్నా క్రిష్ కు డేట్స్ ఇస్తారేమే చూడాలి.


Click it and Unblock the Notifications











