»   » తేజ తో రానా, కాజల్ సినిమా : షూటింగ్ మొదలైందట

తేజ తో రానా, కాజల్ సినిమా : షూటింగ్ మొదలైందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పడు చిత్రం, నువ్వూ నేనూ లాంటి చిన్న చిత్రాలతో అద్బుతమైన విజయాలు సాధించిన దర్శకుడు తేజ. అమితే ఆయనకు గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ విజయం ఒక్కటి కూడా లేదు. ఆయన ఈమధ్య నే రూపొందించిన "హోరా హోరీ" కూడా ధారుణంగా నిరాశపరిచింది.

తేజ ఇప్పుడు మరో ప్రయత్నం చేయబోతున్నారు. రానా ..,కాజల్ జంటగా ఆయన ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ తో కూడిన మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. అంతేకాదు ఇప్పటివరకూ తాను తయారుచేసుకున్న కథకు తగిన హీరోను తేజ ఎంచుకున్నాడు. ఈసారి మాత్రం ఆయన రానాను దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేసుకోవడం విశేషం. ఈ సినిమా శుక్రవారం రామానాయుడు స్టూడియో సెట్స్ పైకి వెళ్లింది. కాజల్ కూడా హాజరైంది.

Rana Daggubati Teja movie launched

లక్ష్మీ కల్యాణం సినిమా ద్వారా కాజల్ ను తెలుగు తెరకి పరిచయం చేసింది తేజానే. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న కాజల్, చాలా కాలం తరువాతమళ్ళీ తేజతో కలిసి చేస్తోంది. స్క్రిప్టు చాలా బాగా వచ్చిందని అంటున్నారు.

ఒక వైపున రానా .. మరో వైపున కాజల్ బిజీగా వున్నా, ఈ సినిమాను వాళ్లు అంగీకరించడానికి కారణం, స్క్రిప్టు బలంగా ఉండటమేనని అంటున్నారు. తేజను సక్సెస్ పలకరించి చాలాకాలమైంది. అందువలన ఈసారి ఆయన సక్సెస్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని చెబుతున్నారు. మరి ఆయన ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందేమో చూడాలి.

English summary
The Pooja of Rana Daggubati's new movie, directed by Teja, was done Yesterday at Ramanaidu Studios in Hyderabad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu