»   » రానా చేసిన పనికి షాకైన మహేష్ బాబు (వీడియో)

రానా చేసిన పనికి షాకైన మహేష్ బాబు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భలే మంచి రోజు' మూవీ ఆడియో వేడుకకు మహేష్ బాబు, రానాలు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సీడీలను ఆవిష్కరించి... తొలి సిడీ రానాకు అందజేసారు. ఇదే ఆడియో వేడుకలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

ఆడియో వేడుకకు రానా కంటే ముందుగానే తన కొడుకు గౌతంతో కలిసి వచ్చి కూర్చున్నారు మహేష్ బాబు. కొంత సేపటి తర్వాత రానా వచ్చారు. రానా వచ్చినే మహేష్ బాబు వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు. మహేష్ బాబు వారించేలోపే ఇది జరిగిపోయింది. అసలు రానా ఇలా చేస్తాడని ఉహించని మహేష్ బాబు షాకయ్యారు. ఎప్పటిలాగే చిరునవ్వులు చిందించారు.

Rana Daggubati Touched Mahesh Babu's Feet

కొంత సేపటి తర్వాత రానా మహేష్ బాబు వద్దకు వచ్చి కబుర్లలో మునిగి పోయారు. మహేష్ బాబు, రానా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని ఈ సంఘటన బట్టి స్పష్టమవుతోంది. గతంలో ఓ చిట్ చాట్లో మహేష్ బాబు అభిమాని అడిగిన ప్రశ్నకు రానా ఇచ్చిన సమాధానం అభిమానులను కాస్త హర్ట్ చేసింది. మహేష్ బాబుతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తారా? ఫ్రెండ్, బ్రదర్, విలన్ లాంటి పాత్రలు చేస్తారా? అనే ప్రశ్నకు రానా ‘నో' అని సమాధానం ఇవ్వడమే ఇందుకు కారణం.

ఆ సమయంలో రానా వాలకం చూసిన వారంతా... మహేష్ బాబు అంటే రానాకు పెద్దగా ఇష్టం ఉండదేమో అనుకున్నారు. కానీ ‘భలే మంచి రోజు' ఆడియో వేడుకలో జరిగిన సంఘటన ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని ప్రూవ్ చేస్తోంది. ఈ వీడియో చూసి మహేష్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీలవుతున్నారు.

English summary
Rana Daggubati Touched Mahesh Babu's Feet At Bhale Manchi Roju Audio Launch.
Please Wait while comments are loading...