#మీటూ ఎఫెక్ట్: ముంబైలో ప్రత్యక్షమైన రానా దగ్గుబాటి, ఊహించని ఛాన్స్!

#మీటూ ఉద్యమం గత నెల రోజుల్లో బాలీవుడ్లో ఊహించని మార్పులకు కారణమైంది. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'హౌస్‌ఫుల్ 4' సినిమా విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు నానా పాటేకర్ నటి తనుశ్రీ దత్తా చేసిన #మీటూ ఆరోపణల కారణంగా తప్పుకున్నారు.

నానా పాటేకర్ తప్పుకోవడంతో తెలుగు స్టార్ రానా దగ్గుబాటికి అనుకోని అవకాశం దక్కింది. పాటేకర్ స్థానంలో రానాను తీసుకున్నారు. బాలీవుడ్ బిగ్ మూవీలో కీలకమైన పాత్ర పోషించే అవకాశం రావడంతో రానా కూడా వెంటనే ఒకే చెప్పారు.

ముంబైలో ఉన్నానంటూ రానా ట్వీట్

‘హౌస్ ఫుల్ 4' మూవీ సెట్స్‌కు వచ్చాను. చాలా కాలం తర్వా త ముంబైలో షూటింగ్.... అంటూ రానా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్ ద్వారా తాను ఈ చిత్రంలో భాగం అయ్యానంటూ రానా అఫీషియల్‌గా వెల్లడించినట్లయింది.

ఇకపై ఎవరైనా శ్రీరెడ్డితో పెట్టుకున్నారో అంతే... వన్ పంచ్‌తో ఫసక్!

రానా కూడా ఊహించలేదేమో?

రానా కూడా ఊహించలేదేమో?

తనుశ్రీ దత్తా #మీటూ ఆరోపణల తర్వాత బాలీవుడ్లో పరిస్థితులు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. నెల రోజుల ముందు రానా సైతం తనకు ‘హౌస్‌ఫుల్ 4' లో నటించే అవకాశం వస్తుందని బహుషా ఊహించి ఉండరు. నానా పాటేకర్ తప్పుకోవడంతో చిత్ర నిర్మాతలు ఆఘమేఘాల మీద రానాను సంప్రదించి ఒప్పించారు.

పదేళ్ల క్రితం జరిగిన సంఘటన వల్లే

పదేళ్ల క్రితం జరిగిన సంఘటన వల్లే

పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించినట్లు తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనుశ్రీ ఇష్యూ తర్వాత బాలీవుడ్లో #మీటూ ఉద్యమం మరింత ఉధృతమైంది.

దర్శకుడు కూడా ఔట్

దర్శకుడు కూడా ఔట్

హౌస్‌ఫుల్ 4 మొదట సాజిద్ ఖాన్ దర్శకత్వంలో మొదలవ్వగా... ఇతగాడు చాలా మంది నటీమణులను లైంగికంగా వేధించినట్లు #మీటూ ఆరోపణలు రావడంతో పక్కకు తప్పించారు. దీంతో పర్హాద్ సాంజి దర్శకత్వ బాధత్యలు చేపట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X