వైయస్ జగన్ విషయమై 'లీడర్' రాణా దగ్గుపాటి హ్యాపీ
"లీడర్" చిత్రంతో పరిచయమైన దగ్గుపాటి రాణా..రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు వెంటనే స్పందిస్తున్నాడు. జగన్ రాజీనామాని దృష్టిలో పెట్టుకుని...ఆయన తాజాగా ఏమని ట్వీట్ చేసారంటే...మన దేశం చాలా క్లిష్ట పరిస్ధితిలో ఉంది, మనందరకి ఒక మార్గం చూపే నాయకుడు రావల్సిన సమయం ఇది అన్నారు. ఇది చదివిన వారంతా జగన్ ని డైరక్ట్ గా సపోర్టు చేయటానికే ఇచ్చారంటున్నారు. అలాగే మన వ్యవస్ధలో, విధానాల్లో, రాజకీయంలో, మనందరిలో మార్పు తీసుకొచ్చే లీడర్ మనకు కావాలి అన్నారు. ఇక ఈ రెండు వాక్యాలు చదివిన వారు గతంలో రాణా ...యువకులలో తన ఫేవరెట్ పొలిటీషన్ వైయస్ జగన్ అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు. అలాగే లీడర్ లో రాణా పాత్ర కూడా ఓ పదివిలో ఉండి చనిపోయిన ముఖ్యమంత్రి కొడుకు కథే కావటం విషేషం. ఇక కాంగ్రేస్ హైకమాండ్ కి వ్యతిరేకంగా జగన్ ముందుకు వెళ్తూండటంతో రాణా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడని, తన సన్నిహితులకి ఫోన్స్ చేసి ఈ విషయమై డిస్కషన్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి లీడర్ కాన్సెప్ట్ రాణా తలలో బాగానే రిజిస్టర్ అయ్యిందన్నమాట. ఇక రాణా ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నేనూ..నా రాక్షసి చిత్రం చేస్తున్నారు. రాణా సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











