భళ్లాలదేవుడికి అరవై లక్షల సైన్యం.. పెరుగుతున్న రానా స్టామినా
దగ్గుబాటి రానాకు సోషల్ మీడియాలో ఉన్న పాపులార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి చిత్రాల కంటే ముందుగానే బాలీవుడ్‌లో పని చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. ఆపై ప్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ అందర్నీ ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఎంతో కష్టపడి బాడీని తగ్గించి అరణ్య సినిమాను చేశాడు. ఈ చిత్రం కోసమే రానా భారీగా బక్క చిక్కిపోయాడు.
రానాలో ఉన్న ఈ పట్టుదలే ఆయన క్రేజ్‌కు కారణమైంది. పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని మార్చుకుంటూ వస్తున్నాడు. భళ్లాలదేవగా అందర్నీ భయపెట్టిన రానా.. అరణ్య చిత్రంలో బక్కపల్చగా కనిపించాడు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ మూలంగా అరణ్య సినిమా విడుదల కాలేకపోయింది. ఈ లాక్ డౌన్‌లోనే రానా సోషల్ మీడియా ఖాతా ద్వారా తన ప్రేయసిని పరిచయం చేశాడు. తాను యస్ చెప్పిందని తెలుపుతూ ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండే రానా.. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ ఉంటాడు. రానాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. తాజాగా ట్విట్టర్ సైన్యం ఆరు మిలియన్లకు చేరుకుంది. కాగా మిగతా సోషల్ మీడియా ఖాతాలైన ఇన్‌స్టాగ్రామ్‌లో 3.9మిలియన్స్, ఫేస్ బుక్‌లో నాలుగు మిలియన్లకు దగ్గరగా ఫాలోవర్స్ ఉన్నారు. రానాకు తన ప్రేయసి మిహీకాకు ఆగస్టులో పెళ్లి జరుగబోతోన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











