twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హద్దుల్ని చెరిపేసే కథ.. పక్కా ఎంజాయ్ చేస్తారు: 'రాజారథం'పై రానా..

    |

    Recommended Video

    'రాజరథం' లో రానా.. కనిపించడు..వినిపిస్తాడు !

    హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా 'రాజారథం' ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. డిసెంబర్‌ 26న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. కన్నడలో బిగ్గెస్ట్‌ హిట్‌ గా నిలిచిన 'రంగితరంగ' కాంబినేషన్ 'రాజారథం'తో మరోసారి రిపీట్ అవుతుండటంతో.. సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

    ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో హీరో నిరూప్‌ భండారి, హీరోయిన్‌ అవంతిక శెట్టి, దర్శకుడు అనూప్‌ భండారి, రామజోగయ్యశాస్త్రి, అబ్బూరి రవి, నిర్మాతల్లో ఒకరైన సతీష్‌ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

     రాజారథం..:

    రాజారథం..:

    నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా నటిస్తున్న 'రాజారథం' సినిమాకు అనూప్‌ భండారి దర్శకుడు. జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన 'రంగితరంగ' కన్నడలో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. యు.ఎస్‌.లో ఈ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ అయింది. అక్కడ 300 సెంటర్స్‌లో రన్‌ అవ్వడమే కాకుండా కొన్ని చోట్ల 50 రోజులు ప్రదర్శింపబడడం విశేషం.

     అబ్బూరి రవి:

    అబ్బూరి రవి:

    ట్రైలర్ లాంచ్ సందర్భంగా మాటల రచయిత అబ్బూరి రవి సినిమా విశేషాల గురించి వివరించారు. 'సినిమా దర్శకుడు అనూప్‌ భండారి గురించి తెలిసి ముందు ఆశ్చర్య పోయాను. అయిన కన్నడలో డైరెక్ట్‌ చేసిన 'రంగితరంగ' సంవత్సరం పాటు ప్రదర్శితమై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.' అని చెప్పారు.

     అన్ని ఎమోషన్స్ ఉన్న చిత్రం..:

    అన్ని ఎమోషన్స్ ఉన్న చిత్రం..:

    'ఇప్పుడు అన్ని ఎమోషన్స్‌తో అనూప్‌ దర్శకత్వంలో 'రాజరథం' రూపొందింది. అద్భుతమైన స్క్రీన్‌ప్లే కుదిరింది. ఈ సినిమా ద్వారా నిరూప్‌ భండారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇది పెద్ద సూపర్‌హిట్‌గా నిలిచి నిరూప్‌, అనూప్‌లకు మంచి వెల్‌కమ్‌ మూవీ అవుతుంది' అని అబ్బూరి రవి పేర్కొన్నారు.

    రామజోగయ్య శాస్త్రి:

    రామజోగయ్య శాస్త్రి:

    డైరెక్టర్‌ అనూప్‌ మంచి టాలెంటెడ్‌ పర్సన్‌. తనలో ఎంత విజన్‌ ఉందో..అంతే హ్యుమర్‌ కూడా ఉంది. నాతో మంచి పాటలను రాయించుకున్నారు. ఆల్బమ్‌ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.

    అవంతిక శెట్టి:

    అవంతిక శెట్టి:

    రాజరథం' నా తొలి తెలుగు సినిమా. అనూప్‌గారి దర్శకత్వంలో నిరూప్‌ వంటి కోస్టార్‌తో కలిసి పనిచేయడం..నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్‌.

     నిరూప్ భండారి:

    నిరూప్ భండారి:

    'రాజరథం' సినిమా చేయడానికి ముందు నాకు తెలుగు వచ్చేది కాదు. డబ్బింగ్‌ చెప్పే సమయానికి తెలుగు నేర్చుకున్నాను. సినిమా బాగా వచ్చింది. రానాగారు మా యూనిట్‌ను అభినందించడానికి వచ్చినందుకు ఆయనకు థాంక్స్‌.

    మా ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా కోసం కష్టపడ్డాం. డైరెక్షన్‌, మ్యూజిక్‌ ను అన్నయ్య చేస్తే, కాస్ట్యూమ్స్‌ను వదిన డిజైన్‌ చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను. తెలుగు ప్రేక్షులు నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను.

     నిర్మాత:

    నిర్మాత:

    అనూప్‌ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'రంగితరంగ' చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో మేమే డిస్ట్రిబ్యూట్‌ చేశాం. ఓవర్‌సీస్‌లో ఆ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఓ థియేటర్‌లో 50 రోజులు ప్రదర్శితమైంది. ఓవర్‌సీస్‌లో అంత మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకున్న సినిమా అదే.

    తర్వాత అనూప్‌ను కలిసి..తనతో రాజరథం సినిమాకు అసోసియేట్‌ అయ్యాం. హై టెక్నికల్‌ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మేకింగ్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించాం. అలాగే ఈ సినిమాకు మోరల్‌ సపోర్ట్‌ అందిస్తున్న హీరో రానా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

     హద్దులను చెరిపేసే కథ: రానా

    హద్దులను చెరిపేసే కథ: రానా

    నేను ఒక సినిమా అవార్డ్‌ ఫంక్షన్‌ను హోస్ట్‌ చేస్తున్నప్పుడు 'రంగితరంగ' సినిమా ఎక్కువ అవార్డులను గెలుచుకుంది. అప్పటి వరకు అనూప్‌ భండారి నాకు పరిచయం లేదు. ఆ తర్వాతే అనూప్‌ను కలిసి తనతో పరిచయం పెంచుకున్నాను.

    ఈ సినిమాలో నేను కనిపించను..వినిపిస్తాను. నా దృష్టిలో హద్దులను చేరిపేసే కథలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో 'రాజరథం' ఒకటి. అటువంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. నేను కూడా అలాంటి సినిమాలనే చూడటానికి ఇష్టపడతాను.

    పూర్తి వివరాలు:

    పూర్తి వివరాలు:

    హీరో, హీరోయిన్: నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి. మాటలు: అబ్బూరి రవి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఎడిటింగ్‌: శాంతకుమార్‌, సినిమాటోగ్రఫీ: విలియమ్‌ డేవిడ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధాకర్‌ సాజ, నిర్మాణం: జాలీహిట్స్‌ టీమ్‌, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: అనూప్‌ భండారి.

    English summary
    Rajaratham is an upcoming Telugu movie, directed by Anup Bhandari of 'Rangitaranga' fame and produced by Ajay Reddy Gollapalli of Jolly hits Pvt Ltd,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X