»   »  వాలంటైన్స్ డే: హీరో రానా ఎవరితో ఎక్కడికెళ్లాడు?

వాలంటైన్స్ డే: హీరో రానా ఎవరితో ఎక్కడికెళ్లాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వాలంటైన్స్ డే.... ప్రపంచ ప్రేమికులకు పండగ దినోత్సవం. ఈ రోజును ఒక్కొక్కరూ ఒక్కోరకంగా ప్లాన్ చేసుకుంటారు. ఇక ప్రేమలో ఉన్న జంటల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో పలువురు హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు నడుపుతున్నట్లు వార్తల్లో నిలిచిన తెలుగు హీరో రానా దగ్గుబాటి కూడా ఈ రోజును ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నాడు.

ఈ రోజు నా వాలంటైన్స్ డే డేట్స్ అమ్మ, చెల్లికి ఇచ్చేసాను. వారితో కలిసి టెంపర్ సినిమా చూడటానికి వెలుతున్నాను అంటూ...రానా తన సోషల్ నెట్వర్కింగు పేజీలో ఓ ఫోటో పోస్టు చేసాడు. తనకు లవర్స్ ఎవరూ లేరు అని చాటి చెప్పడానికే రానా ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది.

Rana Daggubati Valentine's dates details

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రానా సినిమా కెరీర్ విషయానికొస్తే...
‘లీడర్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన రానాకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఆయన నటించిన ‘బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాలు త్వరలో విడుదలకు సిద్దమవుతున్నాయి. వీటి విడుదల తర్వాత తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశతో ఉన్నాడు రానా.

Read more about: rana, రానా
English summary
"My Valentine's dates my mom and sister going and watching #Temper" Rana Daggubati said.
Please Wait while comments are loading...