Virata Parvam Twitter Review: రానా మూవీకి షాకింగ్ టాక్.. సాయి పల్లవిని ఘోరంగా.. ఫైనల్ రిపోర్ట్ ఇలా!

బడా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. కెరీర్ ఆరంభం నుంచీ ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోన్న అతడు.. ఇప్పుడు 'విరాట పర్వం' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో ఈ మూవీ తాజాగా విడుదలైంది. స్వచ్చమైన ప్రేమకథకు నక్సలైట్ ఉద్యమాన్ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది? ట్విట్టర్‌లో ఈ సినిమాపై ఎలాంటి రివ్యూలు వస్తున్నాయి? ఈ మూవీలో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి? ఓవరాల్‌గా నెటిజన్లు 'విరాట పర్వం' గురించి ఏం చెబుతున్నారు? అనేవి చూద్దాం పదండి!

వెన్నెల ప్రేమకథే విరాట పర్వం

వెన్నెల ప్రేమకథే విరాట పర్వం

దగ్గుబాటి రానా హీరోగా వేణు ఉడుగుల తీసిన చిత్రమే 'విరాట పర్వం'. సాయి పల్లవి ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలను పోషించారు.

అలాంటి కథతో తెరకెక్కిన మూవీ

అలాంటి కథతో తెరకెక్కిన మూవీ

'నీది నాదీ ఒకే కథ' వంటి చిత్రంతో ప్రశంసలు అందుకున్న వేణు ఉడుగుల ఇప్పుడు 'విరాట పర్వం' వంటి స్వచ్చమైన ప్రేమకథను తెరకెక్కించాడు. ఈ సినిమా రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో నక్సలైట్‌ ఉద్యమం నేపథ్యంతో రూపొందింది. దీన్ని ఎంతో ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కించారు. ఇందులో సాయి పల్లవి పాత్ర ఎంతో హైలైట్‌గా రాసుకొచ్చాడు.

భారీ అంచనాలు.. బిజినెస్ ఇలా

భారీ అంచనాలు.. బిజినెస్ ఇలా

'విరాట పర్వం' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

‘విరాట పర్వం’కు షాకింగ్ టాక్

‘విరాట పర్వం’కు షాకింగ్ టాక్


దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' మూవీ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొందరు ఇది బాగుందని అంటుంటే.. మరికొందరు బాలేదని కామెంట్ చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా


'విరాట పర్వం' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం హీరోయిన్ సాయి పల్లవి పాత్ర రవన్నగా చేసిన రానా ప్రేమలో పడడం వంటి సన్నివేశాలను చూపించారట. అయితే, ఇదంతా చాలా స్లోగా నడిచిన ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు. సెకెండాఫ్ కొంచెం పర్వాలేదనిపించినా.. ఇది నిరాశగానే ఉంటుందట. అయితే, క్లైమాక్స్ మాత్రం చాలా బాగుందని తెలుస్తోంది.

సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా

సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా

'విరాట పర్వం' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో సాయి పల్లవి వన్ ఉమెన్ షో చేసిందట. ఆమెకు గట్టి పోటీ ఇచ్చేలా రానా ఇరగదీశాడని అంటున్నారు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. దర్శకుడు ఎంచుకున్న నేపథ్యం, ఎమోషన్ మిస్ అవడం, స్లో నేరేషన్‌ మైనస్‌గా మారాయట.

మొత్తంగా మూవీ ఎలా ఉందంటే!

మొత్తంగా మూవీ ఎలా ఉందంటే!

ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. 'విరాట పర్వం' మూవీ భావోద్వేగాలతో కూడిన వెన్నెల జర్నీగా తెరకెక్కించారట. ఇలాంటి సినిమాలు తెలుగు ఫిల్మ్ హిస్టరీలోనే చాలా వచ్చాయి. అయితే, ఇందులో సరికొత్త అంశాలు జోడించడంతో ఆసక్తికరంగా సాగుతుందట. కానీ, ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా ఇది లేకపోవడంతో యూత్‌కు కనెక్ట్ కావడం కష్టమేనని టాక్.

క్లైమాక్స్ మాత్రం ఘోరంగానే

క్లైమాక్స్ మాత్రం ఘోరంగానే


నెటిజన్లు చేస్తున్న ట్వీట్ల ప్రకారం.. 'విరాట పర్వం' సినిమాలో రానా పాత్రకు ఆకర్షితురాలైన వెన్నెల.. అతడి కోసం అడవి బాట పట్టడమే ఈ సినిమా కథ. అయితే, ఇందులో హీరోయిన్ ప్రేమ, ఎమోషన్ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా లేదని అంటున్నారు. ఇక, వెన్నెల పాత్రకు క్లైమాక్స్‌లో శాడ్ ఎండింగ్ ఇవ్వడం నిరాశకు గురి చేసేలా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X