రానా లవ్ ఎఫైర్.. నాగ చైతన్య, సమంత సలహా ఇస్తారా!

Recommended Video

Rana Daggubati Asks Relationship Advise From Naga Chaitanya And Samantha Akkineni | Filmibeat Telugu

బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా దగ్గుబాటి రానా అందరిని మెప్పించాడు. రానా నటించిన ఘాజి చిత్రం దేశస్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. విభిన్నమైన చిత్రాలతో రానా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని ఎంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా రానా వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా రానా, త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా సరదగా చేసిన ట్వీట్ తో మరోమారు ఈ చర్చ మొదలైంది.

 మజిలీ ప్రచారం

మజిలీ ప్రచారం

రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు చిత్రంపై అంచనాలు పెంచాయి. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచుర కార్యక్రమాల జోరు పెంచింది. సమంత, నాగ చైతన్య ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించారు. మీరు రిలేషన్ షిప్ కి సంబంధించిన సలహాలు కోరుకుంటున్నారా.. అయితే మాతో మీ సందేహాలు పంచుకోండి అని సమంత, నాగ చైతన్య ట్వీట్ చేశారు.

 రానా సరదాగా

రానా సరదాగా

దీనికి దగ్గుబాటి రానా సరదాగా స్పందించాడు. నేను కూడా అడగొచ్చా అని ట్వీట్ చేశాడు. రానా సరదాకి అలా అడిగినా అతడి ప్రేమ వ్యవహారం గురించి చర్చ మొదలైపోయింది. క్రేజీ హీరోయిన్ సమంత, రానా మధ్య రిలేషన్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. మధ్యలో వారిద్దరూ విడిపోయారని కూడా ఊహాగానాలు వినిపించాయి. త్రిష పలు సందర్భాల్లో రానా తనకు చిన్ననాటి నుంచి మంచి స్నేహితుడని చెబుతోంది.

వివాహం తర్వాత

వివాహం తర్వాత

ఇక మజిలీ చిత్రం విషయానికి వస్తే.. వివాహం తర్వాత చైతు, సమంత కలసి నటిస్తున్న చిత్రం ఇదే. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. నాగ చైతన్య పాత్రలో రెండు షేడ్స్ ఉండబోతున్నాయి. యువ క్రికెటర్ గా చైతు ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంతతో వివాహం తర్వాత చైతు పాత్ర మరో కోణంలో ఉండబోతోంది.

భార్యభర్తలుగా

భార్యభర్తలుగా

సమంత, చైతు ఈ చిత్రంలో భార్య భర్తలుగా నటించనుండడం ఆసక్తిగా మారింది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గోపి సుందర్ ఈ చిత్రానికి నిర్మాత. ఏప్రిల్ లో ఈ చిత్ర విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. దివ్యాన్ష కౌశిక్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. సరైన విజయం లేక సతమమవుతున్న చైతూకు మజిలీ రూపంలో అయినా హిట్ దక్కుతుందేమో చూద్దాం!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X