త్రిషతో నాకు వర్కౌట్ కాలేదు.. అందుకే విడిపోయాం.. బయటపెట్టేసిన రానా!

Recommended Video

Rana Daggubati Wants To Set Up Prabhas With Katrina Kaif ! | FILMIBEAT TELUGU

సినీతారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చాలా రూమర్స్ ప్రచారం జరుగుతుంటాయి. అప్పుడప్పుడూ ఆ రూమర్స్ లో కొన్ని నిజమవుతుంటాయి కూడా. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య ఏదైనా ప్రేమ వార్త బయటకు వస్తే హాట్ టాపిక్ గా మారుతుంది. ఆరడుగుల ఆజానుబాహుడు రానా విషయంలో కూడా అలాంటి రూమరే ప్రచారం జరిగింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో రానా తన ప్రేమ వ్యవహారాల గురించి బయటపెట్టాడు.

త్రిషతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు

త్రిషతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు

చాలా రోజుల క్రితం త్రిష, రానా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందని అప్పట్లో అంతా భావించారు. త్రిష కానీ, రానా కానీ ఈ రూమర్స్ పై ఎప్పుడూ స్పందించలేదు. ఫోటోలు లీక్ అయ్యే సమయానికే త్రిష టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. రానా అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. బాహుబలి తరువాత రానా జాతీయ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

త్రిషతో డేటింగ్ నిజమే

త్రిషతో డేటింగ్ నిజమే

కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో రానా పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నించాడు. దశాబ్ద కాలంగా త్రిషతో క్లోజ్ గా ఉన్నావు. మీరిద్దరూ ఎందుకు విడిపోయారు అని కరణ్ జోహార్ ప్రశ్నించాడు. దీనికి రానా సమాధానం ఇచ్చాడు. త్రిష నాకు దశాబ్దం నుంచి స్నేహితురాలు. ఆమెతో కొద్దిరోజులు మాత్రమే డేటింగ్ చేశా. మా ఇద్దరి మధ్య రిలేషన్ వర్కౌట్ కాలేదు. అందుకే విడిపోయాం అని రానా తెలిపాడు.

త్రిషని సెట్ చేస్తా

త్రిషని సెట్ చేస్తా

ఈ షోలో రానా గురించి ప్రభాస్ కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇండస్ట్రీలోఒకరిని రానాకు సెట్ చేయాలంటే ఎవరిని ఎంచుకుంటావు అని కరణ్ అడిగాడు. దీనికి ప్రభాస్ సమాధానం ఇస్తూ త్రిష అని తెలిపాడు. ప్రభాస్ త్రిష పేరు చెప్పగానే రానా ఆశ్చర్యపోయాడు. రానాకు ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు ప్రభాస్ కు జోడిగా కత్రినా కైఫ్ పేరు చెప్పాడు.

ప్రభాస్ కంటే ముందుగా

ప్రభాస్ కంటే ముందుగా

రాజమౌళి మాట్లాడుతూ నా అంచనా ప్రకారం ప్రభాస్ కంటే ముందుగా రానా పెళ్లి చేసుకుంటాడని తెలిపాడు. ప్రభాస్ అన్ని విషయంలో చాలా లేజీగా ఉంటాడు. కానీ రానా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటాడని రాజమౌళి తెలిపారు. పెళ్లి అంటే చాలా పనులు ఉంటాయి. అమ్మాయిని వెతకాలి. బంధువులని పిలవాలి. పెళ్లి కార్యక్రమాలు చూసుకోవాలి. ప్రభాస్ కు ఉండే బద్ధకం వలన ఎలాంటి పనులన్నీ కష్టం అని రాజమౌళి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X