పెళ్లి కొడుకు రెడీ.. మోగాల్సిందే భాజా భజంత్రీలే.. రానా, వెంకీ హల్‌చల్
దగ్గుబాటి వారసుడు రానా పెళ్లికి సర్వం సిద్ధమైంది. వాస్తవానికి ఊరంతా పందరి వేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనేకొనే ప్లాన్స్‌పై కరోనావైరస్ దెబ్బ తీసింది. దాంతో రానా పెళ్లిని తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు నిరాడంబరంగా జరిపించే విధంగా ప్లాన్ చేశారు. పెళ్లి పనుల్లో భాగంగా రానా పోస్టు చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటో వెనుక కథ ఏమిటంటే..

శనివారం రాత్రి 8.30 గంటలకు
రానా, మిహిక పెళ్లి ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలోజరుగనున్నది. శనివారం రాత్రి 8.30 గంటలకు తెలుగు, మర్వాడీ పెళ్లి సంప్రదాయ పద్దతిలో జరిపించనున్నారు. ఈ పెళ్లి కోసం స్టూడియోలో ఏర్పాటు చేసిన వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఫలక్ నుమా ప్యాలెస్‌కు చేరుకొన్నాయి.

పెళ్లికి ముందు వేడుకలు జోష్‌గా
పెళ్లికి ముందు జరుగాల్సిన హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య జోష్‌గా జరిగినట్టు సమాచారం. హల్దీ సంబురాల్లో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్‌గా మారాయి. నవ దంపతులుగా మారబోతున్న రానా, మిహికా బజాజ్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

రానా, వెంకీ, సురేష్ బాబు ముగ్గురు కలిసి
రానా పెళ్లికి ఇంకా కొన్ని గంటల సమయంలో ఉండగా తన తండ్రి సురేష్ బాబు, బాబాయ్ వెంకటేష్‌తో కలిసి దిగిన ఫోటోను టాలీవుడ్ భళ్లాలదేవ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. కుటుంబ వేడుకలంటే జోష్‌ను రెండింతలు చేసే వెంకటేష్ తమ కుమారుడి పెళ్లిని సంతోషంగా ఆస్వాదిస్తున్నట్టు కనిపించింది.

సంప్రదాయ దుస్తుల్లో దగ్గుబాటి
రానా, వెంకటేష్, సురేష్ దగ్గుబాటి తెలుగు సంప్రదాయ పద్దతిలో పంచె, లాల్చీతో సందడి చేస్తున్నారు. రానా విక్టరీ సింబల్ చూపిస్తుండగా.. పెళ్లి కళ వచ్చింది నాకు కాదు.. నా వారసుడిది అంటూ వెంకటేష్ వేలిని రానా వైపు చూపిస్తున్నాడు. ఈ ఇద్దరి హంగామా మధ్య సురేష్ బాబు చిరునవ్వులు చిందిస్తున్నారు.
Recommended Video

పెళ్లి వేదిక వద్ద పలు జాగ్రత్తలు
ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉండటం కారణంగా పెళ్లి వేదిక వద్ద పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వేదిక వద్ద బయోసెక్యూర్ బబుల్‌ను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేశారు. రానా పెళ్లికి 30 మంది కంటే ఎక్కువ మంది అతిథులను ఆహ్వనించలేదు నిర్మాత సురేష్ బాబు చెప్పారు.


Click it and Unblock the Notifications











