వక్రీకరించారు : విక్రమ్‌కు సారీ చెప్పిన రానా
హైదరాబాద్ : ప్రముఖ సౌతిండియా యాక్టర్ విక్రమ్, తెలుగు హీరో రానా మధ్య ఎట్టకేలకు మాటల యుద్దానికి తెర పడింది. ఈ విషయాన్ని తాజాగా రానా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'మొత్తానికి విక్రమ్ తో స్వయంగా మాట్లాడాను. అతను చెప్పిన విషయాన్ని మీడియా వారు వక్రీకరించారని అర్థమైంది. నేను ముదు వెనక ఆలోచించకుండా కాస్త కఠినంగానే రియాక్టయ్యాను. విక్రమ్, అతని అభిమానులకు అపాలజి చెబుతున్నాను' అంటూ రానా ట్వీట్ చేసాడు
అసలు ఏం జరిగింది?
విక్రమ్ ఇటీవల ఓ ఇంటర్వూలో దక్షిణాది నటులు ఎందుకు బాలీవుడ్‌లో విజయం సాధించలేకపోతున్నారనే అంశంపై స్పందిస్తూ... 'రానా దగ్గుపాటిని చూడండి తెలుగులో కెరీర్ ప్రారంభించాడు. కానీ దక్షిణాదిన ఏమీ సాధించలేదు. అందుకే అతన్ని తెలుగు ఇండస్ట్రీనే పట్టించుకోవటం లేదు. బాలీవుడ్ లో పని చేయాలంటే...నేను ఇక్కడ అన్నీ వదిలేసుకుని అక్కడికి రావాలి అన్నాడు' అంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వెలువడ్డాయి.
విక్రమ్ వ్యాఖ్యలపై రానా ఘాటుగా స్పందించారు. 'పది డిసాస్టర్ సినిమాలకు దగ్గరవుతున్న నువ్వు, నీ కెరీర్ పైనే దృష్టి పెట్టడం ఉత్తమం. నటుడుగా నా వయస్సు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే. కాని ఇరవై ఐదు సంవత్సరాలకు దగ్గరవుతున్నావు. నువ్వు నీ గురించే ఆలోచించుకో' అంటూ వ్యాఖ్యానించాడు.
ఈ పరిణామాలు మీడియాలో తెగ ప్రచారం జరుగడంతో తెలుగు, తమిళ సినీ ప్రముఖులంతా అవాక్కయ్యారు. ఇప్పటి వరకు సినీ రంగంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకోలేదు. ఇది హద్దులు దాటితే మంచిది కాదని అంతా ఆందోళన పడుతున్న తరుణంలో ఇద్దరు రాజీకి వచ్చి అపాలజీ చెప్పుకోవడంతో మంచి పరిణామం అంటున్నారంతా.


Click it and Unblock the Notifications











