ముదురు భామతో రానా మరోసారి రొమాన్స్!
హైదరాబాద్: రానా దగ్గుబాటి....ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలోనే ‘దమ్ మారో దమ్' అనే హిందీ చిత్రంలో నటించాడు. మంచి హైట్, కలరు, పర్సనాలిటీ ఉండటం అతనికి తొలినాళ్లలోనే బాలీవుడ్ అవకాశాలు వచ్చేలా చేసింది. మరో వైపు తెలుగులో ఫ్యామిలీ వారసత్వంతో ఇక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళంలోనూ అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రానా మరో హిందీ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'NIA' అనే టైటిల్ ఖరారైటనట్లు సమాచారం. ఈ చిత్రంలో అతను బాలీవుడ్ ముదురు భామ బిపాసా బసుతో రొమాన్స్ చేయబోతున్నాడు. గతంలో ‘దమ్ మారో దమ్' చిత్రంలో ఇద్దరూ కలిసి అప్పట్లో హాట్ అండ్ సెక్సీగా రొమాంటిక్ సీన్లు పండించారు. సినిమా పెద్దగా నడవక పోయినా...ఈ ఇద్దరి మధ్య జరిగిన హాట్ రొమాంటిక్ సన్నివేశాలకు మంచి గుర్తింపు వచ్చింది.

మరో వైపు తమిళంలో కూడా రానా మరో సినిమాకు సైన్ చేసాడు. ఈ చిత్రం 2015లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం రానా తెలుగులో రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అందులో ఒకటి రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి' చిత్రం. మరొకటి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి' చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











