రానా మిహీక కళ్యాణ వైభోగం.. ఇంట్లో నుంచే పెళ్లిని చూసేలా దగ్గుబాటి ఏర్పాట్లు.. నానీ ఎలా చూశాడో తెలుస
దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటి వాడయ్యాడు. ప్రేమించిన ప్రేయసి మిహీకాకు నేటి రాత్రి (8 30) మూడు ముళ్లు వేశాడు. ఈ వేడుకకు అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలతో అతి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఇక రానా పెళ్లి వేడుకను వీక్షించేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలకు ఓ చక్కటి సదుపాయాన్ని కల్పించాడు. వర్చువల్ వీడియోతో పెళ్లి సందడిని ఇంట్లో నుంచే చూసేలా ఏర్పాట్లు చేశారు. నాని, అనిల్ రావిపూడి వంటి వారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటూ సందడి చేశారు.

తక్కువ మంది అతిథులతో..
రానా మిహీకల వివాహానికి అతి తక్కువ మంది హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి.. అతి సమీప బంధువులను మాత్రం ఆహ్వానించారు. నేడు రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ పెళ్లి తంతు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

బన్నీ హాజరు..
రానా పెళ్లికి అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఇక బన్నీ సైతం డిజైనర్ దుస్తుల్లో మెరిసి నిజంగానే స్టైలీష్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక వెంకీ నల్లటి దుస్తుల్లొ మెరవగా.. నాగ చైతన్య తనకు ఇష్టమైన తెల్లటి రంగు దుస్తుల్లో సింపుల్‌గా దర్శనమిచ్చాడు.

ఇంట్లో నుంచి వీక్షించిన నాని..
వర్చువల్ స్కోప్ ద్వారా రానా వివాహాన్ని ఇంటి నుంచే వీక్షించిన నాని సోషల్ మీడియాలో ఓ సెటైర్ వేశాడు. ఓ ఐకానిక్ బ్యాచ్లర్ లైఫ్ ఎండ్ కాబోవడం చూస్తున్నాను.. కంగ్రాట్స్ బాబాయ్ ఈ టెక్నాలజీ ఏంటో' అంటూ ట్వీట్ చేశాడు. ఇక నాని షేర్ చేసిన ఫోటో, పెట్టిన కామెంట్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో..
ఇక రానా మిహీక పెళ్లిని డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వర్చువల్ టెక్నాలజీ ద్వారా వీక్షించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ తన దైన శైలిలోకౌంటర్ వేశాడు. ‘హ్యాపీ మ్యారిడ్ లైఫ్ మిస్టర్ అండ్ మిసెస్ రానా.. వర్చువల్ టెక్నాలజీతో అక్కడ లేకున్నా.. అక్కడే ఉన్నట్టు ఫీల్ అయి చూసే దాకా వచ్చాం.. ఈ టెక్నాలజీ ఏదయితే వుందో.. అది సూపర్' అంటూ ట్వీట్ చేశాడు.
Recommended Video

చివరి నిమిషంలో మహేష్ విషెస్..
చివరి నిమిషంలో మహేష్ బాబు రానాకు విషెస్ తెలిపాడు. ఈ మేరకు మహేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రానా మిహీక పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ.. ‘రానా మిహీక మీ పెళ్లి జరగబోతోన్నందుకు కంగ్రాట్స్.. మీ జీవితాంతం ప్రేమ, సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నా'ను అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











