ముంబైలో రాణా ఇంటి వేట!
ముంబై: యువ హీరో రాణా దగ్గుబాటి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్లోనూ రాణాకు సరైన హిట్ లేదు. రాణా చివరగా హిందీలో నటించిన 'డిపార్ట్ ముంట్' చిత్రం పరాజయం పాలైంది. అయితే రాణా మాత్రం బాలీవుడ్‌ను వదలడం లేదు. ఎలాగైనా సరే బాలీవుడ్లో రాణించి నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముంబైలో తనకంటూ ఒక ఇల్లు ఉండాలని భావిస్తున్న రాణా అక్కడ అపార్ట్ మెంట్ కొనేందుకు ట్రై చేస్తున్నారు. సినీస్టార్లు ఎక్కువగా ఉండే ముంబైలోని బాంద్రా, జుహు లాంటి ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కోసం వేట సాగిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు రాణాకు తన టేస్టుకు తగిన ఇల్లు దొరకలేదు.
రాణా ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో రాణా సరసన నయనతార హీరోయిన్‌గా చేస్తోంది. మరో వైపు రాణా పంజా దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరో వైపు బాలీవుడ్ ఆఫర్ల కోసం చాలా ట్రై చేస్తున్నాడు. నిర్మాత వారసుడిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుంటున్నాయి. అయితే రాణా గత సినిమాల ఫలితం దృష్ట్యా ఎవరూ అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మరి స్టార్ హీరో కావాలనే రాణా ఆశ ఎప్పుడు నెరవేరుతుందో?


Click it and Unblock the Notifications











