twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాణా 'దమ్ మారో దమ్' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

    By Srikanya
    |

    'లీడర్' చిత్రంతో తెరంగ్రేటం చేసిన రాణా తదుపరి చిత్రం 'దమ్ మారో దమ్' (హిందీలో) పిబ్రవరి నాలుగు, 2011న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఫాక్స్ స్టూడియోస్, రమేష్ సిప్పీ సంయుక్తంగా ఈ రిలీజ్ డేట్ ప్రకటన చేసారు. ఈ సందర్భంగా రమేష్ సిప్పీ మాట్లాడుతూ...గ్రేట్ విజువల్ అప్పీల్ తో గ్రిప్పింగ్ గా మా సినిమా బాగా వచ్చింది..ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం రూపొందిస్తున్నాం అన్నారు. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ గోవాలో జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ జూన్ 8 నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి రచన శ్రీధర్ రాఘవన్. జయదీప్ సహానీ పాటలు రాస్తున్న ఈ సినిమాకి ప్రీతమ్ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే ఫాక్స్ స్టూడియోస్ మరియు రమేష్ సిప్పీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. రాణా సరసన బిపాసాబసు చేస్తోంది. అభిషేక్ బచ్చన్ హీరోగా చేస్తున్నారు. ఆదిత్యాపంచోలి, ప్రతీక్ బబ్బర్ నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం రాణా..సెల్వరాఘవన్ దర్శకత్వంలో చిత్రం చేయనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X