రేపు విడుదలవుతోన్న దమ్ మారో దమ్ తో తెలుగోడి దమ్మేంటో చూపిస్తా..
అతను తెలుగులో చేసింది ఒక్క సినిమాయే. రెండో సినిమాకి బాలీవుడ్ చెక్కేశాడు. రోహన్ సిప్పీ దర్శకత్వంలో రమేష్ సిప్పి నిర్మించిన 'దమ్ మారో దమ్"లో మన దగ్గుబాటి రానా ఛాన్స్ కొట్టేశాడు. అభిషేక్ బచ్చన్, బిపాసా బసు, ఆదిత్య పంచోలి వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర రాణాను వరించింది.
రాణాకు దక్కిన అదృష్టానికి టాలీవుడ్ హీరోలు సైతం ఆశ్చర్య పోయారు. ఆ సినిమా ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక నిజంగానే రాణా బాలీవుడ్ హీరోలా వున్నాడని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. దాంతో 'దమ్ మారో దమ్" పై తెలుగు ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లోనూ ఓ క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా ఎలా వుండబోతోంది అన్నది చర్చనీయాంశమైంది. రేపు (22.04.11)ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో రాణా బాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడా లేక టాలీవుడ్డే మేలు అంటాడో వెయిట్ అండ్ సీ.
rana dum maro dum bipasha basu deepika padukone abhishek bachchan రాణా దమ్ మారో దమ్ బిపాసా బసు దీపికా పదుకొనే అభిషేక్ బచ్చన్


Click it and Unblock the Notifications